Mahesh Babu: శ్రీలీలతో అంటే తాట ఊడిపోద్ది.. ఇక మీరే అమ్మ, నాన్న.. మహేష్ ఎమోషనల్
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఇక ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదల అయిన పాటలు సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా.. మీనాక్షి చౌదరి గెస్ట్ అప్పీరియెన్స్ ఇచ్చింది. తమన్ సంగీతం అందించారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటు జరుపుకుంది. అందులో మహేశ్ బాబు ఎమోషనల్ కామెంట్స్ చేసారు.
Recommended Video

మహేష్ బాబు మాట్లాడుతూ... అందరికీ నమస్కారం.. చాలా ఆనందంగా ఉంది. గుంటూరు ఫంక్షన్ జరుగుతుంది. ఎక్కడ ఫంక్షన్ చేయాలని డిస్కర్షన్ చేస్తుంటే.. త్రివిక్రమ్ మీ ఊర్లో చేద్దామని చెప్పారు. త్రివిక్రమ్ గారంటే చాలా ఇష్టం. నా ఫ్యామిలీ పర్సన్ లాగా.. గత రెండు సంవత్సరాలుగా ఆయన ఇచ్చిన సపోర్ట్.. థ్యాంక్యూ సో మచ్. అతడు చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలు అయింది. ఖలేజాలో ఓ మ్యాజిక్ జరిగింది. అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది. మీరో కొత్త మహేశ్ బాబును చూడబోతున్నారు. ఐ లవ్ యూ సార్ అంటూ త్రివిక్రమ్ కు మహేశ్ బాబు తెలిపారు.

మా ప్రోడ్యూసర్ చినబాబు గారికి మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే. ఒక ప్రోడ్యూసర్ మొహంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ వేరే. మీరు ఇచ్చిన సపోర్టు మరిచిపోలేను. మీరు నన్ను బాగా చూసుకున్నారు. మీతో మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇక శ్రీలీల గురించి మాట్లాడుతూ.. మన తెలుగు అమ్మాయి పెద్ద హీరోయిన్ అవ్వడం ఆనందంగా ఉంది. ఆ అమ్మాయికి షాట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది. ఈ అమ్మాయితో డ్యాన్స్ వేయడం... వామ్మో.. అంటూ మహేశ్ బాబు చెప్పుకువచ్చాడు.
శ్రీలీలతో డ్యాన్స్ అంటే హీరోలందరీకి తాట ఊడిపోద్ది.. ఆమెతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక మీనాక్షి చౌదరి గెస్ట్ అప్పియరెన్స్ చేసింది. నేను త్రివిక్రమ్ అడగ్గానే చేసింది. థ్యాంక్యూ సో మచ్.. ఇక తమన్ గురించి చెప్తూ.. తమన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకో బ్రదర్ లాగా.. ఈ సినిమాలో లాస్ట్ పాట కుర్చి మడతబెట్టి పాట అద్భుతంగా ఇచ్చారు. రేపు మీరు ఆ పాట చూడండి థియేటర్లు బద్దలు అవుతాయి. థ్యాంక్యూ తమన్ అంటూ మహేశ్ తెలిపారు.

ఇందాక నా ఏవీ చూసినప్పుడు పాతిక సంవత్సరాలు అని వేశారు. నేనే నమ్మలేకపోతున్నాను. థ్యాంక్యూ సోమచ్. మాటల్లేవ్.. చేతులెత్తి దండం పెట్టడం తప్ప. ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు.. సంక్రాంతి నాకు బాగా కలిసివచ్చిన పండగ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే బ్లాక్ బస్టరే. ఈసారి ఏదో కొత్తగా ఉంది. నన్న గారు మన మధ్యలేరు. నా సినిమా చూసి ఫోన్ చేసి చెప్పేవారు. అవన్నీ మీరే చెప్పాలి. ఇక నుంచి మీరే అమ్మ, నాన్న, అన్ని. మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.


Click it and Unblock the Notifications











