Guntur Kaaram Event Live: మహేష్, శ్రీలీల, త్రివిక్రమ్‌కు ఘనస్వాగతం.. ఈవెంట్‌కు ఎవరెవరు వెళ్లారంటే?
సూపర్‌స్టార్ మహేష్ బాబు, గ్లామర్ డాల్ శ్రీలీల జంటగా నటించిన గుంటూరు కారం జనవరి 12వ తేదీన రిలీజ్ అవుతున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక, హాసిని బ్యానర్‌లో చినబాబు నిర్మించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఘనంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన విశేషాలు, ప్రముఖుల స్పీచ్ విషయానికి వెళితే..
గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ప్రదేశానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని నంబూర్ ఎక్స్ రోడ్స్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుక కోసం త్రివిక్రమ్, మహేష్ బాబు, చినబాబు, దిల్ రాజు, తమన్, శ్రీలీల, నాగవంశీ, మీనాక్షి చౌదరీ తదితరులు హాజరుకానున్నారు.

గుంటూరు కారం సినిమా ఈవెంట్ కోసం హైదరాబాద్ నుంచి గుంటూరుకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. త్రివిక్రమ్, మహేష్ బాబు, చినబాబు, దిల్ రాజు, తమన్, శ్రీలీల, నాగవంశీ, మీనాక్షి చౌదరీ తదితరులు వెళ్తూ దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
గుంటూరు చేరుకొన్న గుంటూరు కారం సినిమా యూనిట్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీగా స్వాగతం పలికారు. విమానాశ్రయానికి భారీగా తరలివచ్చారు. మహేష్ బాబుకు అభిమానులు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు.
గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే వేదిక వద్దకు భారీగా అభిమానులు చేరుకొన్నాడు. మధ్యాహ్నం నుంచే పలు ప్రాంతాల నుంచి ఫ్యాన్స్ అక్కడికి చేరుకొన్నారు. వేడుక జరిగే ప్రాంతమంతా సందడి సందడిగా మారింది.


Click it and Unblock the Notifications











