Trivikram: టాలీవుడ్‌లో అలాంటి హీరో మహేశ్ బాబు ఒక్కరే...స్పీచ్‌తో ఘాటెక్కించిన త్రివిక్రమ్

గుంటూరు కారం సినిమాతో మహేశ్ బాబు ఈ పండక్కి వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటు గుంటూరులో జరుపుకుంది. ఇక గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో నిర్వహించడానికి కారణం సినిమా పేరు గుంటూరు కారం అవ్వడమే అంటూ చెప్పుకువచ్చారు. ఇక రెండో కారణం మహేష్ మీ వాడు, మనందరి వాడు అందుకే ఆయన మీ మధ్య ఈ ఫంక్షన్ చేయాలని షూటింగ్లో బాగా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నా సరే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాడని వెల్లడించారు.

Recommended Video

Guntur Kaaram Event లో Mahesh Babu Attitude పై Trivikram Comments | Telugu Filmibeat

అందుకని మీరు కొంచెం క్రమశిక్షణగా మెలిగి పోలీసు వారికి సహకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం, అలాంటి ఒక గొప్ప నటుడు, మహామనిషి అలాంటి ఆయనతో నేను నేరుగా పని చేయలేకపోయానని తెలిపారు. కానీ ఆయన పని చేసిన సినిమాకి పోసాని కృష్ణ మురళి గారి దగ్గర రైటర్ గా పని చేశానని చెప్పుకువచ్చారు. ఆయనతో నాకు నేరుగా పరిచయం కలిగిన సందర్భం అది ఒక్కటే అని వెల్లడించారు.

 Guntur Kaaram Pre Release Event Live: Trivikram Comments on Mahesh Babu and Krishna Full Details Here

ఆ తర్వాత మహేష్ బాబుతో అతడు, ఖలేజా లాంటి సినిమాలు చేసినప్పుడు కృష్ణ గారితో మాట్లాడాను. ఆయనతో గడిపిన ప్రతిక్షణం చాలా చాలా అమూల్యమైనదని తెలిపారు. అంత గొప్ప మనిషికి పుట్టినటువంటి మహేష్ ఇంకెంత అదృష్టవంతుడో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందని మనసులో మాట బయటపెట్టారు. కృష్ణ గారి కొడుకుగా తన తండ్రి చేయలేని కొన్ని రకాల సినిమాలను కూడా చేయడానికి రెడీగా ఉండే తండ్రికి తగ్గ తనయుడు అనిపిస్తూ ఉంటుందని తెలిపారు. ఒక సినిమాకి 100% పని చేయాల్సి ఉంటుంది అంటే 200% పనిచేసే నటుడు మహేష్ బాబు ఒక్కరే అంటూ కొనియాడారు.

ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమలో ఏ ఒక్కరు వెనక్కి తిరిగి చూసే ప్రశ్న లేదని తెలిపారు. ఈ మాట చెప్పడానికి ఎవరు వెనుకాడరు. నేను అతడు, ఖలేజా సినిమాలకు పని చేసినప్పుడు ఎలా ఉన్నారో ఈ రోజుకు కూడా అలానే ఉన్నారని ఆసక్తికర కామెంట్స్ చేశారు.. ఆయన హీరో అయి పాతికేళ్లు అవుతుందని మీరంటున్నారు కానీ నాకు మాత్రం ఆయన రెండు మూడేళ్ల క్రితం హీరోగా పరిచయమయ్యాడనిపిస్తుందని తెలిపారు. చూడడానికి ఎంత యంగ్ గా కనిపిస్తున్నాడో మనసులో కూడా అంతే యంగ్ గా ఉంటాడు, పర్ఫామెన్స్ విషయంలో కూడా అంతే నూతనంగా అంతే యవ్వనంతో ఉన్నాడని ప్రశంసల వర్షం కురిపించాడు.

ఆయనకు మరిన్ని వసంతాలు అదే యవ్వనం ఉండాలని ఆయనకు కృష్ణ గారి తరపున మీ అందరూ ఆయన వెనుక ఉండాలని ఆయన ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జనవరి 12వ తేదీన థియేటర్లో కలుద్దాం అంటూ త్రివిక్రమ్ తెలిపారు. ఈ సంక్రాంతి చాలా గొప్పగా జరుపుకుందాం ఆనందంగా జరుపుకున్నాం రమణ గాడితో కలిసి జరుపుకుందాం థాంక్యూ నమస్కారం అంటూ తన స్పీచ్ ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X