Guntur Kaaram Twitter Review: గుంటూరు కారం మూవీ ఎలా ఉంది? మహేష్ హిట్టు కొట్టాడా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత చిన్నబాబు తన సోంత బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్ పై నిర్మించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, జయరామ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రీమియర్స్ దేశంలో, విదేశాల్లో ప్రారంభమైన నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాలు మీ కోసం..

గుంటూరు కారం మూవీ ఎక్సలెంట్‌గా ఉంది. మహేష్ తన ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. మహేష్ వన్ మ్యాన్ షో. బ్లాక్ బస్టర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
గుంటూరు కారం సినిమాకు సరిగ్గా మొత్తంగా డ్యూటీ చేసింది కేవలం తమన్ మాత్రమే. అన్న మాత్రమే బాగా బీజీఎం ఇచ్చాడు. ఎవడైనా మిక్సింగ్, బీజీఎం బాగాలేదంటే.. కావాలని నిన్ను విమర్శించే వాళ్లే. ఆ విషయం గుర్తుంచుకో అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే సనిమా. అలాగే కలెక్షన్లు రాబట్టే చిత్ర. ఫస్టాఫ్ ఒకేగా ఉంటుంది. మహేష్ బాబు వింటేజ్ లుక్, ఫెర్ఫార్మెన్స్ బాగుంది.తమన్ మ్యూజిక్ నిరాశ పరిచింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్, త్రివిక్రమ్‌ను సినిమాలు తీయడం ఆపేయమని చెప్పేయండి. ఖలేజా, అతడు రేంజ్ అంచనా వేస్తే.. బాబీ సినిమా చూపించాడు అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మహేష్ బాబు 25 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూర్తి చేసుకొన్న నేపథ్యంలో బెంగళూరులో అభిమానులు పండగ చేసుకొన్నారుు. దాదాపు 25 కేకులు కట్ చేశారు.. రాజకుమారుడు నుంచి గుంటూరు కారం సినిమా వరకు కేకులు తయారు చేశారు.
సోషల్ మీడియాలో టాక్ నమ్మకండి. సెకండ్ వాచ్ కూడా నచ్చింది. బాబు రాంపేజ్ మోడ్‌లో కనిపించాడు. సినిమాని ఎవ్వడూ ఆపలేడు. సంక్రాంతి రుబాబు బాబుదే గుంటూరు కారం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు
గుంటూరు కారం సినిమా సెకండాఫ్ యావరేజ్‌గా ఉంది. కేవలం మహేష్ బాబు కోసమే చూడాలి. ఇంకా ఏమీ అంచనా వేయవద్దు. తమన్, మహేష్ పవర్ ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకొన్నాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
గుంటూరు కారం సినిమా యూనిట్‌కు హీరో నాని విషెస్ తెలియజేశారు. గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి బిగ్ బ్యాంగ్‌తో ప్రారంభమవుతున్నది. ఈ పండుగకు అదిపెద్ద సంక్రాంతిగా మారుతున్నది. ఈ రేసులో అండర్ డాగ్ తేజ సజ్జా కూడా ఉన్నారు. అందరికీ నా బెస్ట్ విషెస్ అని నాని ట్వీట్ చేశారు.
మహేష్ బాబు అన్నకు నా స్పెషల్ లవ్. గుంటూరు కారం సినిమాకు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. త్రివిక్రమ్ గారు ఆల్ ది బెసట్, తమన్, శ్రీలీల, మీనాక్షి చౌదరీ అందరికి నా ఆల్ ది బెస్ట్ అని సాయిధరమ్ తేజ్ అన్నారు.
జై బాబు.. జై జై బాబు.. మహేష్ బాబు కోసం ఇది మా లవ్ , ప్యార్ ఇష్క్. మా సూపర్ ఫ్యాన్స్ కోసం సూపర్ స్పెషల్ కార్డు. ప్రతీ స్క్రీన్‌లో స్పెషల్ గుంటూరు కారం అంటూ ఓ వీడియోను పెట్టారు.
కొద్ది గంటల్లో అసల సిసలైన కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మా గుంటూరు కారం సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. త్రివిక్రమ్ గారు మార్క్ ఎంటర్‌టైనర్, యూత్‌కు, ఫ్యామిలీ ఆడియెన్స్ నచ్చే విధంగా ఉంటుంది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా హై ఎనర్జీతో నటించారు.


Click it and Unblock the Notifications











