Mahesh Babu ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్.. అంతా తమన్ చేతుల్లోనే.. అదేంటంటే?

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన మహేశ్ బాబు అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సుధీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ఫారెన్ టూర్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేశ్ బాబు రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారం నుంచి ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ కానుక రానుండగా.. SSMB29 సినిమాకు సంబంధించి ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఇంతకీ అవేంటనే వివరాల్లోకి వెళితే..

జోరుగా సినిమాలు : బాల నటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి అదిరిపోయే ఇండస్ట్రీ హిట్స్ తో సత్తా చాటిన మహేశ్ బాబు 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుని హవా చాటాడు. దీంతో మరింత జోరుగా సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.

maheshbabuthaman

2 క్రేజీ చిత్రాలు : మహేశ్ బాబు ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా ఒకటి అయితే.. దర్శకదిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో SSMB29 మూవీ మరొకటి. గుంటూరు కారం సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

maheshbabuthaman

ఫారెన్ వెకేషన్ : ఆది నుంచి ఆటంకాలు ఏర్పడుతున్న గుంటూరు కారం సినిమాలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా.. హిట్ 2 భామ మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా చేస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డేతో త్రివిక్రమ్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేశ్ బాబు ఫారెన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో సినిమాకు బ్రేక్ పడింది.

Guntur Karam Makers Plans To Release Song On Mahesh Babu Birthday

గుంటూరు కారం స్పెషల్ : ఇక ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా అభిమానుల కోసం గుంటూరు కారం టీమ్ స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. ఆరోజున ఓ పాటను మేకర్స్ రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే ఆ పాటను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రెడీ చేసి, దాని అప్రూవల్ అయి అంతా ఓకే అనుకున్నాకే రిలీజ్ చేస్తారట. అంటే సాంగ్ రిలీజ్ అవ్వడం, లేదు అన్నది అంతా తమన్ చేతుల్లోనే ఉందన్నమాట.

Guntur Karam Makers Plans To Release Song On Mahesh Babu Birthday

బ్యాడ్ న్యూస్ : ఇక మహేశ్ బాబు చేస్తున్న మరో ప్రతిష్టాత్మక సినిమా SSMB29. జక్కన దర్శకత్వంలో అడ్వెంచరస్ మూవీగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. అందులో ఒకటే ఈ సినిమాను మహేశ్ బాబు బర్త్ డే అంటే ఆగస్టు 9న లాంచ్ చేస్తారని టాక్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఆరోజున SSMB29ని లాంచ్ చేయలేట్లేదని సినిమా యూనిట్ తెలిపిందట. ఇప్పుడు ప్రారంభం అయితే గానీ, సినిమా ఎప్పటికే రాదనుకున్న అభిమానులకు లాంచింగ్ కే ఇంకాస్త సమయం పట్టడం బ్యాడ్ న్యూసే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X