Mukesh Gowda: హీరోగా మారబోతున్న "గుప్పెడంత మనసు" రిషి సార్.. సినిమా పేరంటో తెలుసా?
గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ హ్యాండ్సమ్ గా సీరియస్ పాత్రలో కనిపిస్తూ.. అందరినీ మంత్రముగ్ధులను చేసే రిషి సార్ అంటే అమ్మాయిలకు విపరీతమైన క్రేజ్. ఆయన ఎక్కడకు వెళ్లినా రిషి సార్, రిషి సార్ అంటూ పిలుస్తూ.. రచ్చ చేస్తుంటారు. ఇన్నాళ్లూ బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈయన తాజాగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. తెలుగులోనే మొదటి సినిమా చేసేందుకు ఒకే చెప్పారు. ఈక్రమంలోనే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.
గుప్పెడంత సీరియల్ హీరో ముఖేష్ గౌడ హీరోగా రాబోతున్న మొదటి తెలుగు చిత్రం గీతా శంకరం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సినిమాలోని నటీనటులతో పాటు దర్శక, నిర్మాతలు కూడా పాల్గొన్నాడు. ఈ సినిమాలో ముఖేష్ గౌడ సరసన ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వెల్లడించారు. రుద్ర అనే అతను నూతన డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. అలాగే ఎస్.ఎస్.ఎం.జి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ బిజినెస్ మమేన్ కె.దేవానంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

గీతాశంకరం సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని తెలుస్తోంది. అయితే దీపావళి పండుగ సందర్భంగా శుక్రవారం రోజు సంస్థ కార్యాలయంలో ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో రిషి సార్ బైక నడుపుతుండగా.. హీరోయిన్ ప్రియాంక శర్మ వెనకాల కూర్చొని ఉంది. లాంగవోణీ వేసుకున్న హీరోయిన్ అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తోంది. ఇక రిషి లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చమైన పల్లెటూరి అబ్బాయిలా కనిపిస్తున్నాడు. సింపుల్ ప్యాంట్ అండ్ షర్టు వేసుకొని హీరోయిన్ వైపు చూస్తూ బైక్ నడుపుతున్నాడు. వెనకాల కూర్చున్న ఆమె రిషిని ప్రేమగా చూస్తోంది.
అయితే నవంబర్ 14వ తేదీ నుంచి సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందని... ప్రొడ్యూసర్ దేవానంద్ తెలిపారు. అలాగే తాను సినిమా చేయాలని తెలుసుకున్న చాలా మంది కొన్ని కథలతో వచ్చారని.. కానీ వాటిలో రుద్ర చెప్పిన కథనే తనకు బాగా నచ్చిందని అన్నాడు. అందుకే ఈ సినిమా తీయాలనుకున్నామని.. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని వెల్లడించారు. అలాగే డైరెక్టర్ మాట్లాడుతూ.. తనను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్లుగా ఈ కథను సినిమాగా మలచాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు డైరెక్టర్ రుద్ర చెప్పుకొచ్చారు. తనతో పాటు సినిమా కోసం కష్టపడుతున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు.

అచ్చమైన పల్లెటూరి ప్రేమకథకు తనను హీరోగా సెలెక్ట్ చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉందని హీరో ముఖేష్ గౌడ చెప్పారు. ఈ దీపావళి పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం మరింత సంతోషంగా ఉందన్నారు. తాను హీరోగా నటిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ ను ఎలాగైతే ఆదరిస్తున్నారో ఈ చిత్రాన్ని కూడా అలాగే ఆదరించాలని కోరారు. ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని ముఖేష్ గౌడ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











