SSMB28 : మహేష్ ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్.. ఆ టైం కి రెడీగా ఉండండి !
మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్ సిద్ధం చేసింది హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ. గత కొద్ది రోజులుగా మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే ఈ రోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని నిన్న సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనే అంశం మీద క్లారిటీ లేదు. అయితే కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించిన ప్రకటన హారిక హాసిని సంస్థ తన అధికారిక సోషల్ మీడియా ద్వారా వెలువరించింది.
మీరు అందరూ ఎదురుచూస్తున్న వార్త ఫైనల్ గా వచ్చేస్తోంది సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు అందరూ రెడీగా ఉండండి, అందరూ హారిక హాసిని ట్విట్టర్ ఖాతాకి ట్యూన్ అయి ఉండండి అంటూ ప్రకటించారు. అలా పోస్ట్ చేసి మహేష్ బాబు 'అతడు' సినిమాలోని 'తొలి తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే' అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా మహేష్ బాబు నడుచుకుంటూ వస్తున్న పది సెకన్ల వీడియో క్లిప్ కూడా పోస్ట్ చేయడంతో ఈ సినిమా ప్రకటన మీద మరింత హైప్ ఇచ్చినట్లయింది.

నిజానికి ఎన్టీఆర్ 30వ సినిమా త్రివిక్రమ్ - హారిక హాసిని కాంబినేషన్ లో చేయాల్సి ఉంది. కానీ ఏమైందో ఏమో తెలియదు గానీ ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది అంటూ ఒక ప్రకటన వచ్చింది. అప్పటి నుంచి మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకి సంబంధించి అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆ ప్రచారాలు అన్నిటికీ ఈ రోజు సాయంత్రం 4.05 నిమిషాలకు బ్రేకులు పడనున్నాయి.


Click it and Unblock the Notifications











