ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ అప్‌డేట్: ఫొటోతో ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపిన నిర్మాణ సంస్థ
వరుస విజయాలతో దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్.. 'అల.. వైకుంఠపురములో'తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. పలు కారణాల వల్ల షూటింగ్ ప్రారంభం కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్ ఇచ్చింది.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను అతడి నివాసంలో కలిశాడు. ఈ భేటీలో వీళ్లిద్దరి మధ్య కొత్త ప్రాజెక్టు గురించి చర్చలు జరిపారు. దీనికి సంబంధించిన ఫొటోను ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. అంతేకాదు, 'ఎన్టీఆర్ గారు.. మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఈరోజు కలుసుకున్నారు. తారక్ గారి ముప్పైవ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుంది' అని అందులో పేర్కొన్నారు. దీంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా... త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత.. వీరరాఘవ' తర్వాత వస్తున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పెడుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అలాగే, ఇటీవల దీనికి 'రాజా వచ్చినాడు' అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఓ న్యూస్ లీకైంది. ఇక, ఈ మూవీలో తారక్ రెండు పాత్రలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో ఒకరు బాలీవుడ్ నుంచి వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ మూవీలో సునీల్ విలన్‌గా, ఉపేంద్ర కీలక పాత్రను పోషిస్తున్నాడని టాక్.


Click it and Unblock the Notifications











