‘పుష్ప’తో అల్లు అర్జున్ అదిరిపోయే రికార్డు: ఫస్ట్ డేనే బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ప్లాన్ రెడీ

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే అద్భుతమైన టాలెంట్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్లుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో హిట్లను అందుకున్నా.. గత ఏడాది 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో కెరీర్‌లోనే తొలిసారి ఇండస్ట్రీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'పుష్ప' అనే పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

‘పుష్ప’ అంటూ వస్తున్న అల్లు అర్జున్

‘పుష్ప’ అంటూ వస్తున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ ఇందులో కీలక పాత్రను చేస్తోంది.

ఐకాన్ స్టార్ అయ్యేందుకు సాహసాలతో

ఐకాన్ స్టార్ అయ్యేందుకు సాహసాలతో

'పుష్ప' మూవీ గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఘాటీ రోడ్‌లో లారీ డ్రైవింగ్ నేర్చుకోవడం.. డీ గ్లామర్‌గా కనిపించడం.. చిత్తూరు యాసలో మాట్లాడడంతో పాటు రియల్ స్టంట్స్ చేశాడని టాక్.

రెండు భాగాలుగా పుష్ప.. షూటింగ్ ఇలా

రెండు భాగాలుగా పుష్ప.. షూటింగ్ ఇలా

ఐదు భాషల్లో రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దాన్ని 'పుష్ప ద రైజ్' పేరిట ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక, ఇప్పటికే మొదటి భాగానికి 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు బ్యాలెన్స్ పార్ట్‌ను పూర్తి చేస్తున్నారు.

రిలీజ్‌కు ముందే రికార్డులతో హైలైట్‌గా

రిలీజ్‌కు ముందే రికార్డులతో హైలైట్‌గా

పుష్ప మూవీ నుంచి ఆ మధ్య 'Introducing Pushpa Raj' అనే వీడియోను విడుదల చేశారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. అలాగే, ఇటీవలే 'దాక్కో దాక్కో మేక', 'శ్రీవల్లి' పాటలను వదలగా ఇవి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణను అందుకున్నాయి.

‘పుష్ప’తో బన్నీ అదిరిపోయే రికార్డు

‘పుష్ప’తో బన్నీ అదిరిపోయే రికార్డు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'పుష్ప' మూవీని యూఎస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం ఈ సినిమా యూఎస్ హక్కులను హంసినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రికార్డు స్థాయి ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది బన్నీ కెరీర్‌లోనే గ్రాండ్ రిలీజ్ అని టాక్.

ఫస్ట్ డేనే బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ప్లాన్

ఫస్ట్ డేనే బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ప్లాన్


'పుష్ప' మొదటి భాగం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హంసినీ, క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు యూఎస్‌లో దీన్ని రికార్డు స్థాయి లొకేషన్స్‌లో విడుదల చేస్తున్నారు. అంతకంటే ముందే అంటే 16వ తేదీన ప్రీమియర్స్‌ను కూడా భారీగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీంతో అక్కడ కలెక్షన్ల వర్షం కురవబోతుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X