మళ్లీ మాజీ ప్రియుడితో నయనతార.. హన్సిక హాట్ కామెంట్
తమిళ చిత్ర పరిశ్రమలో శింబు, హన్సిక మోత్వానీ ప్రేమ వ్యవహారం అప్పట్లో హాట్ హాట్‌గా నడిచింది. అంతా సవ్యంగా సాగుతుందనుకొంటున్న సమయంలో వారిద్దరి విడిపోవడం కూడా గట్టిగానే చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కొనసాగుతూనే ఉంది.
అయితే హన్సిక కంటే ముందు శింబు, నయనతార మంచి రొమాంటిక్ జీవితాన్ని ఎంజాయ్ చేశారు. వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో శింబు, నయనతార విడిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం నయనతార, శింబు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ఇటీవల ఇంటర్వ్యూలో స్పందించాలని హన్సికను కోరగా..

శింబుతో నటించే అవకాశం వస్తే వదులుకోను. అయితే నయనతారకు శింబుతో నటించే అవకాశం రావడంపై నేను మాట్లాడను. పదేళ్ల తర్వాత ఆ విషయం గురించి నేను ప్రస్తావిస్తే బాగుండదు. మీ ప్రశ్నకు స్పందిస్తే సరికాదు అని హన్సిక అన్నారు.
కలిసి నటించడం అనేది శింబు, నయనతారకు సంబంధించిన వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయంపై వారే స్పందిస్తే కరెక్ట్‌గా ఉంటుంది. వారిద్దరు నటిస్తే తప్పేమిలేదు అని హన్సిక అన్నారు. ప్రస్తుతం శింబుతో కలిసి హన్సిక మహా అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు రెడీ అవుతున్నది.


Click it and Unblock the Notifications











