Don't Miss!
- News
`గౌరవనీయులైన హరిరామ జోగయ్య గారికి`: మంత్రి గుడివాడ లేఖ: సింగిల్ పేజ్‌లో ఫుల్ క్లారిటీ
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Hansika Motwani సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్‌తో 105 మినిట్స్..
దక్షిణాదిలో అందాల తార, స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వాని ప్రధాన పాత్రలో రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై 'సింగిల్ షాట్', 'సింగిల్ క్యారెక్టర్'లో నిర్మించిన చిత్రం 105 మినిట్స్. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రంలో ముఖ్య భూమిక పోషించిన హన్సిక మోత్వాని మాట్లాడుతూ.. సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్‌తో ఎంతో వైవిధ్యంగా నిర్మించిన ఈ చిత్రం. నా కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచి పోతుంది. విజువల్స్ చూశాక షూటింగ్‌లో పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. విజువల్స్ చాలా అద్భుతంగా వచ్చాయి అని సంతోషంతో తెలిపారు.
నిర్మాత బొమ్మక్ శివ మాట్లాడుతూ.. సినిమా అనుకున్నది అనుకున్నట్టు చాలా బాగా వచ్చింది. మా డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో అది చాలా అద్భుతంగా తీసాడు. నిజంగా ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించడం నాకు చాలా గర్వంగా ఉంది. త్వరలోనే ట్రైలర్‌తో మీ ముందుకు వస్తాం అని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీయస్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రయోగం నిజంగా దర్శకుడికి, నిర్మాతకు చాలా సాహసం అనే చెప్పాలి. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రానికి సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు.
సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ.. సినిమా అనుకున్నది అనుకున్నట్టు చాలా బాగా వచ్చింది. సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ నా కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా ఉండిపోతుంది అని తెలిపారు.
దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ.. హీరోయిన్ హన్సిక నటనకు తోడుగా మా డీవోపి కిషోర్ కెమెరా వర్క్, మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీయస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ సౌండ్స్ ఎఫెక్ట్స్ నిజంగా ప్రాణం పోశాయి. ప్రొడక్షన్స్ డిజైనర్ బ్రహ్మ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. సినిమా త్వరలో మీ ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలిపారు. ఇలాంటి ఒక ప్రయోగాత్మకమైన సినిమాకి పని చేయడం చాలా సంతోషంగా ఉంది అని యూనిట్ సభ్యులు తెలిపారు.