హన్సిక కూడా అదే దారిలోకి.. అక్కడైనా సక్సెస్ కొడుతుందా?

కశ్మీర్ యాపిల్‌లా ఉండే హన్సిక.. ఒకప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉండేది. వరుస హిట్లతో తెలుగులో టాప్ హీరోయిన్‌గా దూసుకపోయిన ఈ అమ్మడు గత కొంతకాలం నుంచి ఫేడ్ అవుట్ అయింది. సరైన హిట్లు లేక వెనకబడిపోయింది. అందం ఉన్నా కూడా ఆదుకోలేకపోతోంది. దాదాపు కనుమరుగైపోయిందనుకునే ఈ తరుణంలో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ మూవీతోనైనా లైమ్ ‌లైట్‌లోకి వస్తుందా? లేదా? అన్నది చూడాలి.

సందీప్ కిషన్ హీరోగా రాబోతోన్న తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటిస్తోంది. అసలే హిట్లు లేక సతమతమవుతున్న సందీప్‌కు.. ఈ చిత్రం విజయవంతం కావడం ఎంతో ముఖ్యం. అదే సమయంలో హీరోయిన్ హన్సికకు కూడా ఎంతో ముఖ్యం. తెలుగులో చాలా గ్యాప్ తరువాత వస్తోన్న హన్సిక ఈ మూవీతో మరోసారి అందర్నీ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Hansika Motwani Is Going To Act In Web Series

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై స్పందిస్తూ.. వెబ్ సిరీస్‌లు చేయ‌డంలో ఓర‌క‌మైన సంతృప్తి దొరుకుతోంది. రాబోయే రోజుల్లో వీటిదే హ‌వా. త‌ప్ప‌కుండా మ‌రిన్ని వెబ్ సిరీస్‌ల‌లో క‌నిపిస్తాను. కంటెంట్ బాగుంటే చాలు. అవి కూడా సినిమాకి మించిన బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఎక్క‌డైనా న‌ట‌న న‌ట‌నే కదా అని చెప్పుకొచ్చింది హ‌న్సిక‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X