Don't Miss!
- News
తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ సిద్దం - ట్రయిల్ రన్ పూర్తి : ఆ రెండు స్టేషన్ల మధ్య..!!
- Lifestyle
మొదటి నెలల్లో గర్భస్రావం జరగడానికి కారణాలు, ఈ చిట్కాలతో సేఫ్గా ఉండొచ్చు
- Finance
adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Hansika Motwani Marriage ప్రతిష్టాత్మక కోటలో హన్సిక పెళ్లి.. హానీమూన్‌కు ముందే.. ఆ కమిట్‌మెంట్!
దక్షిణాదిలో అగ్రతార హన్సిక మోత్వాని వివాహం జైపూర్‌లోని ముందోటా కోటలో ఘనంగా జరిగింది. తన చిరకాల మిత్రుడు సోహెల్ కటురియా తన మెడలో మూడు మూళ్లువేయగా.. భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. డిసెంబర్ 4వ తేదీన స్నేహితులు, సన్నిహితులు, అతికొద్ది కుటుంబ సభ్యుల మధ్య హన్సిక వివాహం ఆడంబరంగా జరిగింది. ప్రస్తుతం హన్సిక పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హన్సిక పెల్లికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

గ్రీస్ దేశంలో బ్యాచ్‌లర్ పార్టీ
పెళ్లికి ముందు హన్సిక తన స్నేహితులకు భారీగా బ్యాచ్‌లర్ పార్టీని ఇచ్చింది. గ్రీస్ దేశంలో విలాసవంతమైన విందులో తన స్నేహితులతో కలిసి పాల్గొన్నది. బ్యాచ్‌లర్ పార్టీకి సంబంధించిన వీడియోను షేర్ చేసి.. నా జీవితంలో ఎప్పుడూ నా తోడు ఉంటే స్నేహితులు వీరే.. నా బ్యాచ్‌లర్ పార్టీకి రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ హన్సిక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

డిసెంబర్ 2 నుంచి పెళ్లి వేడుకలు
హన్సిక వివాహ వేడుకలు గత మూడు, నాలుగు రోజులుగా రాజస్థాన్‌లోని ప్రతిష్టాత్మకం మందోటా ఫోర్టులో జరుగుతున్నాయి. హల్దీ, సంగీత్, మెహందీ కార్యక్రమాలను ఆనందోత్సాహల మధ్య జరుపుకొన్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి జైపూర్‌లో వివాహ వేడుకలు ఆకాశాన్ని అంటాయి. సంగీత్, మెహందీ, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వేద మంత్రాల మధ్య
హన్సిక పెళ్లి కోసం గులాబీ పూలతో వేదికను అందంగా ముస్తాబు చేశారు. పెళ్లికూతురైన హన్సిక నడిచి వస్తుండగా.. గులాబీ రేకుల వర్షాన్ని తనపై కురిపించారు. డిసెంబర్ 4వ తేదీన వేదపండితుల మంత్రాల మధ్య హన్సిక మోత్వానీ, సోహెల్ కటురియా ఒక్కటయ్యారు. స్నేహితులు, సన్నిహితులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సంప్రదాయ దుస్తుల్లో
అందంగా ముస్తాబైన హన్సిక మోత్వానీ పెళ్లిపీటల మీద మెరిసిపోయింది. ఎరుపు రంగు లహెంగాలో సాంప్రదాయంగా కనిపించింది. మెడలో నగలు, చేతికి గాజులతో దేవకన్యలా కనిపించింది. కుటుంబ సభ్యుల ప్రేమానురాగాల మధ్య తడిసిపోతూ ఆనందంతో కనిపించింది. ఇక పెళ్లి కుమారుడు సోహెల్ తలకు పాగా ధరించి.. షేర్వానీలో ముస్తాబై కనిపించాడు.

పెళ్లి తర్వాత వెంటనే షూటింగుకు హన్సిక
ఇక పెళ్లి తర్వాత వెంటనే సినిమా షూటింగులో పాల్గొనుందుకు హన్సిక సిద్దమవుతున్నారు. హానిమూన్‌కు ముందే తన సినిమాకు సంబంధించిన కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకొనేందుకు ప్లాన్ చేశారు. ఈ ఏడాది చివరల్లో హన్సిక, సోహెల్ హానీమూన్ టూర్‌కు వెళ్తారని సన్నిహితులు తెలిపారు