మహేష్ ఫ్యాన్స్‌కి "హను మాన్" దర్శకుడు సవాల్.. చూసుకుందాం రండి అంటూ
సినీ పరిశ్రమలో పలు పండుగ సీజన్లకి చిన్నా, పెద్దా అని తేడా లేకుండా కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమాని అయినా తెలుగు ఆడియెన్స్ నిలబెడతారు అని ఎన్నో సార్లు ప్రూవ్ అయ్యింది. అయితే ఈ పండుగ సీజన్ల లోనే మరెన్నో ఆసక్తికర పరిణామాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓ పెద్ద సినిమా లేదా పెద్ద హీరో సినిమా ఉండి చిన్న సినిమా అందులోని మంచి బజ్ ఉన్న సినిమా అయితే డెఫినెట్ గా అది పెద్ద క్లాష్ కిందకే వస్తుంది.
అయితే ఇన్నేళ్ళ చరిత్రలో తెలుగు సినిమా దగ్గర చాలా క్లాష్ లు నడిచాయి. కానీ ఈ 2024 ఏడాది సంక్రాంతి దగ్గర వచ్చిన సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే యువ హీరో తేజ సజ్జల సినిమాలు గుంటూరు కారం , హను మాన్ సినిమాలు మాత్రం ఊహించని విధంగా మారాయి. కాగా ఇక్కడ నుంచి తమ హీరో కంటే చిన్నవాడు అలాగే త్రివిక్రమ్ కంటే చిన్న దర్శకుడు అయినటువంటి ప్రశాంత్ వర్మపై మహేష్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు.

కాగా మొన్ననే తేజ సజ్జ ఇదే గుంటూరు కారం సినిమాతో క్లాష్ పై ఓ అవార్డు వేడుకలో కామెడీ చేస్తే దానిని కూడా మహేష్ ఫ్యాన్స్ సీరియస్‌గా తీసుకున్నారు. తేజ సజ్జని దారుణంగా ట్రోల్ చేసి క్షమాపణలు చెప్పాలి అంటూ ట్రెండ్ చేశారు. పైపెచ్చు గుంటూరు కారం నిర్మాత కూడా ఈ మధ్యనే రెండు సార్లు హను మాన్ సినిమా టీం పై చేసిన కామెంట్స్ కూడా చర్చకు దారి తీశాయి.
ఇలా దర్శకుడు, హీరోలపై మాత్రం ఒక నెవెర్ ఎండింగ్ హీట్ అలాగే కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ మాత్రం సైలెంట్ గా మహేష్ ఫ్యాన్స్ కి చురకలు అంటించాడు. మహేష్ ఫ్యాన్స్ విషయంలో సోషల్ మీడియాలో అంతా ఫాలో అవుతున్నాడో ఏమో కానీ తమని ట్రోల్ చేస్తున్న వారు అంతా ఎక్స్ లో కాదు థియేటర్స్ కి రండి అంటూ కౌంటర్ వేసాడు.

ఇప్పుడు ఆయన మహేష్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఆయన మేనల్లుడు, యువ హీరో అశోక్ గల్లా నటించిన చిత్రం "దేవకీ నందన వాసుదేవ" అనే చిత్రానికి కథని అందించాడు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మహేష్ ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం కాదు మీ హీరో కుటుంబం నుంచి వస్తున్న హీరో సినిమాని థియేటర్స్ లో ఆదరించి హిట్ ఇవ్వాలి అన్నట్టుగా వారికి ఇన్ డైరెక్ట్ సవాలునే చేసాడు అని చెప్పాలి. మరి ఘట్టమనేని, మహేష్ బాబు అభిమానులు తమ కాంపౌండ్ నుంచి వస్తున్న యువ హీరోని ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి. ఇక ఈ చిత్రం అయితే నవంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











