HanuMan: బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సక్సెస్ ఎంజాయ్ చేయకుండానే!
అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి సంచలన విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు చాలా తక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇలా వచ్చిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి వచ్చేలా దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోన్న పక్కా తెలుగు సినిమానే 'హనుమాన్'.
విభిన్నమైన సినిమాలతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' మూవీలో తేజ సజ్జా హీరోగా నటించాడు. రియల్ సూపర్ హీరో అయిన ఆంజనేయస్వామి నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశారు. అనుకున్నట్లుగానే ఈ చిత్రానికి అంతటా పాజిటివ్ టాక్ వచ్చింది.

సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందిన 'హనుమాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ లభించడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతోంది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఫలితంగా దీనికి భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ సహా చాలా ప్రాంతాల్లో ఇది 'గుంటూరు కారం' మూవీని దాటేసింది.
వాస్తవానికి 'హనుమాన్' మూవీ రిలీజ్ విషయంలో ఎన్నో సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీనికి థియేటర్ల ఇష్యూ వచ్చింది. ఇలా ఎన్నో ఇబ్బందుల మధ్యన వచ్చి ఇది సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు.
'హనుమాన్' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ప్రశాంత్ వర్మ తాజాగా X (ట్విట్టర్) ఖాతాలో 'మూడు రోజుల నుంచి నేను తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాను. మీ కాల్స్‌కు, మెసేజ్‌లకు నేను స్పందించలేకపోతున్నాను. నేను కోలుకున్న వెంటనే వాటన్నింటికీ స్పందిస్తాను' అంటూ చెప్పాడు. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్‌ను ఇచ్చారు.


Click it and Unblock the Notifications











