Hanu Man: రాజమౌళి రికార్డు సమం చేసిన ప్రశాంత్ వర్మ.. చిన్న బడ్జెట్‌తోనే సెన్సేషన్

తెలుగు ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఎన్నో వచ్చాయి. అవి మన సినిమా స్థాయిని పెంచుతూ దేశ వ్యాప్తంగా సత్తా చాటాయి. దీంతో మన హీరోల మార్కెట్ గణనీయంగా పెరగడంతో పాటు తెలుగు సినిమాలపై అందరి దృష్టి పడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌కు చెందిన దర్శక నిర్మాతలు పాన్ ఇండియా సినిమాల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమ తమ చిత్రాలను పలు భాషల్లో తీసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా భారీ రేంజ్‌లో రాబోతుంది. అదే 'హను మాన్' మూవీ.

తెలుగులో తనదైన చిత్రాలను చేస్తూ దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ 'హను మాన్' మూవీని తెరకెక్కిస్తోన్నాడు. ఇందులో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటిస్తోన్నారు. రియల్ సూపర్ హీరోగా పేరున్న హనుమంతుడి కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే దీని నుంచి విడుదలైన మోషన్ పోస్టర్.. ఈ చిత్రంపై అంచనాలను పెంచేసింది. ఇక, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

Hanu Man

యంగ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న 'హను మాన్' మూవీ హనుమంతుడి కథతో రాబోతుంది. దీంతో ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కుతోంది. ఇక దీని కోసం ఏకంగా 1600 లకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్లను వాడుతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, దీనికోసం నిర్మాతలు ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేసినట్లు కూడా తెలిసింది. గతంలో ఎస్ఎస్ రాజమౌళి కూడా 'మగధీర' చిత్రానికి ఇన్నే షాట్లను ఉపయోగించారట. అంటే.. అప్పటి దర్శకధీరుడి రికార్డును ఇప్పుడు ప్రశాంత్ వర్మ సమం చేశాడు.

Hanu Man

'హను మాన్' మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 12వ తేదీన విడుదల చేయాలని అనుకున్నా.. పనులు పూర్తి కాని కారణంగా దీన్ని వాయిదా వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X