HanuMan: గొప్ప పని చేసిన హనుమాన్ టీమ్.. ఏకంగా అన్ని లక్షలు విరాళంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో కంటే ఇప్పుడు ప్రయోగాత్మక సినిమాలు ఎన్నో వస్తున్నాయి. అలా వచ్చిన చిత్రాలకు ప్రేక్షకులు భారీ స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా ఈ మూవీలు సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఇప్పుడలా రూపొందిన చిత్రమే 'హనుమాన్'. రియల్ సూపర్ మ్యాన్ హనుమంతుడి నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రమే 'హనుమాన్'. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500 థియేటర్లకు పైగానే విడుదల చేశారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఒక రోజు ముందే ప్రీమియర్స్ పడిపోయాయి.

సూపర్ హీరో నేపథ్యంతో క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'హనుమాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ లభించింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కుతోంది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఫలితంగా దీనికి భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. 'హనుమాన్' మూవీకి సంబంధించి ప్రతి టికెట్‌పై వచ్చే డబ్బుల్లో 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన అమౌంట్‌లో 14,85,810 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు ఓ చెక్‌ను కూడా విడుదల చేశారు.

14,85,810 రూపాయలు మాత్రమే కాకుండా 'హనుమాన్' మూవీ థియేట్రికల్ రన్ పూర్తయ్యే వరకూ వచ్చిన మొత్తాన్ని కూడా అయోధ్య రామ మందిరానికి విరాళంగా పంపించబోతున్నారు. అంతేకాదు, పారదర్శకత కోసం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించి అందులో ఎంత విరాళం అందించాము అన్న వివరాలను కూడా పొందు పరచబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇక, తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.


Click it and Unblock the Notifications











