అలా సెటైర్లు వేయడం కరెక్ట్ కాదు.. హను రాఘవపూడి!
యువ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన పడి పడి లేచే మనసు చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులు, సినీ క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంపై వచ్చిన రివ్యూల గురించి హను స్పందించారు. అందరిని మెప్పించడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యంకాని విషయం. కానీ అందరికి నచ్చాలనే ఉద్దేశంతోనే ఎంతో కష్టపడి సినిమా చేస్తాం అని హను తెలిపాడు.
రివ్యూల వలన తాము కొత్త విషయం నేర్చుకోగాగాలి. కానీ కొంతమంది సెటైర్లు వేస్తున్నారని హను తెలిపారు. ఓ రివ్యూ చూశాను.. ప్రాస కోసం వెటకారంగా రివ్యూ రాశారు. పడింది మళ్ళీ లేవలేదు అని రాశారు. అలా టైటిల్ పై సెటైర్లు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు. నాలో లోపాన్ని సరిచేసుకునే విధంగా రివ్యూ ఉంటె నేను స్వీకరించడానికి సిద్ధం అని హను తెలిపాడు.

పడిపడి లేచే మనసు చిత్రంలో క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి, శర్వానంద్ జంటగా నటించారు. ఎమోషల్ ప్రేమ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్ చంద్ర శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











