Prashanth Varma: రాజమౌళి వల్లే ఆ సినిమా క్యాన్సిల్... హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సంచలనం
ప్రశాంత్ వర్మ డైరక్షన్లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగా వంటి సినిమాలకు పోటీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాను వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది చిత్రబృందం.
పలు ఇంటర్వ్యూలు, షోలు చేస్తూ సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్లేందుకు చూస్తుంది. ఇలా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన ప్రశాంత్ వర్మ రాజమౌళిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. హనుమాన్ సినిమా ప్రమోషన్లో భాగంగా వెళ్లిన ప్రశాంత్ వర్మ తనకు మహాభారతం సినిమా తీయాలని ఉంది అంటూ మనసులో మాట బయటపెట్టాడు. ఈ సినిమానే కనుక తాను తీస్తే ఏ క్యారెక్టర్‌కి ఎవరిని క్యాస్ట్ చేస్తాడో కూడా చెప్పాశాడు. మెగాస్టార్ చిరంజీవి ధర్మరాజు పాత్రకు.. రామ్ చరణ్‌ను అర్జునుడిగా తీసుకుంటానని తెలిపాడు.

ఎన్టీఆర్‌ని భీముడిగా, సహదేవుడిగా విజయ దేవరకొండను, నకులుడిగా నానిని, కృష్ణుడిగా మహేశ్ బాబు, దుర్యోధనుడిగా మోహన్ బాబు.. కర్ణుడిగా పవన్ కళ్యాణ్‌ను తీసుకుంటానని తెలిపాడు. కర్ణుడిగా పవన కళాణ్యే ఎందుకని యాంకర్ అడిగిన ప్రశ్నకు మహాభారతంలో అందరూ కర్ణుడిని ఇబ్బంది పెడతారు.. కానీ దానిని అతను ఓర్పుగా ఎదుర్కొంటాడు.. ఆ పాత్రకు పవన్ కళ్యాణే బెటర్‌గా సూట్ అవుతారు అంటూ తన మసనులో మాట చెప్పాడు. అయితే ద్రౌపది పాత్రకు నయన తారను క్యాస్ట్ చేస్తాను అని తెలిపాడు.
తెలుగులో దర్శక దిగ్గజుడు ఎస్ ఎస్ రాజమౌళి మహాభారతాన్ని తీస్తానని ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే మహాభారతాన్ని తీసే ఆలోచనను తాను విరమించుకున్నాడట ప్రశాంత్ వర్మ. జక్కన్న సినిమా చెక్కితే ఎలా ఉంటుందో ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. అలాంటి మహాభారతాన్ని ఆయన తెరకెక్కిస్తున్నాడంటే.. ఎవరైనా కాస్త జంకుతారు. ఈ యువ డైరక్టర్ కూడా అందుకే వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. రాజమౌళి ఈ సినిమా ఎప్పుడూ ప్రారంభిస్తారనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు.
ప్రస్తుతం ఆయన మహేశ్ బాబు సినిమా ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి సినిమా అంటే మినిమం రెండు, మూడు ఏళ్లు పట్టేస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. మాములు కథనే ఓ రేంజ్లో ఎలివేట్ చేసి తీస్తాడు జక్కన్న. అలాంటిది మహాభారతాన్ని ఏ రేంజ్లో చెక్కుతాడో.. ప్రజల ముందుకు ఎన్నాళ్లకు తీసుకొస్తాడో చూడాలి. ఈ సినిమా కోసం ఆయన ఎవరిని నటీనటులుగా సెలక్ట్ చేస్తాడో అనేదానిపై కూడా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే విజువల్ వండర్‌గా మహాభారతాన్ని తెరకెక్కించాలంటే కనీసం 10 పార్ట్స్ ఐనా పడుతుందని ఒక్కో పార్ట్‌కి నాలుగేళ్లు పడుతుందని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మహాభారతం మానియా కేవలం తెలుగులోనే కాదు హిందీలో కూడా అదే రేంజ్లో ఉంది. బాలీవుడ్లో ఇప్పటికే వివేక్ అగ్నిహోత్రి పర్వ అనే టైటిల్‌తో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా మహాభారతాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్‌లో ఎప్పటినుంచో ఉన్నాడు. అయితే దీనిని సినిమాలా కాకుండా వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











