Prashanth Varma యూనివర్స్‌లో 12 సినిమాలు.. హనుమాన్ కాకుండా ఆ 11 మంది సూపర్ హీరోస్ ఎవరంటే?
మొదటి సినిమా అ! తోనే టాలెంటెడ్ డైరెక్టర్ గా నిరూపించుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలతో మంచి పేరు, పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ తెరెక్కించిన మరో క్రేజియెస్ట్ ఫిల్మ్ హనుమాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన మొదటి సినిమా. ఇక ప్రశాంత్ వర్మ హనుమాన్ సహా తన యూనివర్స్ లో భాగంగా 12 సూపర్ హీరోల సినిమాలు రానున్నట్లు ఇంతకముందే తెలిపారు. అయితే ఆ సూపర్ హీరోస్ ఎవరో ఓసారి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన 'అ', 'జాంబిరెడ్డి' సినిమాలతో టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక ఈ దర్శకుడు 'హనుమాన్' అనే సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా.. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమాను నిర్మాత నిరంజన్ రెడ్డి.. మొదట 30 కోట్లతో నిర్మించాలనుకున్నప్పటికీ.. బడ్జెట్ పెరిగిపోయింది. చివరకు ఈ సినిమాను 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమాలో వినయ్ రాయ్ విలన్ గా నటించగా... వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెలకిషోర్, గెటప్ శ్రీను, సత్య కీలక పాత్రల్లో మెప్పించారు. ఇక ఈ సినిమాకు మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇదిలా ఉంటే.. ఇంతకముందే తన సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రశాంత్ వర్మ చెప్పుకువచ్చారు. సూపర్ హీరో కథాంశంతో తన యూనివర్స్ లో 12 సినిమాలు రాబోతున్నాయని తెలిపారు. ఇక ప్రస్తుతం హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక సామాన్యుడికి హనుమంతుడి శక్తులు వస్తే.. ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కాకుండా మరో 11 మంది సూపర్ హీరోలు తన యూనివర్స్ లో ఉండనున్నారు.
హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ 'అధీర'ని తెరకెక్కించనున్నారు. నిర్మాత డివివి దానయ్య కుమారుడు ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబొతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దేవతల రాజు ఇంద్రుడు పవర్స్ ను చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ తన సినిమాటిక్ యూనివర్స్ లో హిందూ గాడ్స్ ని సూపర్ హీరోస్ గా అందరికి ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఇక ఈ యూనివర్స్ లో మొత్తం 12 సినిమాలు రాబోతున్నాయని ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు.

హనుమాన్, అధిర సూపర్ హీరోస్ కాకుండా మిగతా 10 సినిమాల్లో ఎవరు సూపర్ హీరోస్ ఉండనున్నారో అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. హనుమాన్, అధిరలతో పాటు.. ఇండియన్ గార్డ్స్ ను తన సినిమాటిక్ యూనివర్స్ లో వాడనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో రేపు ఏ హీరోలు నటిస్తారో.. ఏ హీరోకు ఏ గాడ్ పవర్స్ ఇస్తారో అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. చూడాలి మరి.


Click it and Unblock the Notifications











