HanuMan అయోధ్య రాముడికే కాదు.. భద్రాద్రి రామాలయానికిక కూడా విరాళం.. ప్రశాంత్ వర్మ
హనుమాన్... సినిమా విడుదల అయి 17 రోజులు అవుతున్నా బాక్సాఫీసు వద్ద మాత్రం భారీ వసూళ్లను రాబడుతూనే ఉందీ చిత్రం. ఇప్పటికీ చాలా చోట్ల టికెట్లు దొరక్కట్లేదు. ఎవరూ ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమా టీం ఇప్పటికీ అయోధ్య రామ మందిర ట్రస్ట్ కు ప్రతీ టికెట్ పై 5 రూపాయలను ఇస్తామని ప్రకటించారు. మొన్నటి వరకూ వచ్చిన మొత్తాన్ని విరాళంగా అందించారు కూడా. అయితే తాజాగా మరో షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు ఈ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి. ఆ విషయాన్ని నేరుగా డైరెక్టర్ యే చెప్పారు. హనుమాన్ సినిమా నుంచి వచ్చిన ప్రతీ రూపాయని ఆ రెండింటి కోసమే వాడబోతున్నట్లు తెలిపారు.
తేజా సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదలైంది. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచి అనేక రికార్డులను క్రియేట్ చేసింది.

చిత్రబృందం ఎప్పటికప్పుడు సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ.. నెక్స్ట్ వచ్చే సీక్వెల్ చిత్రాల గురించి అప్ డేట్లు ఇస్తున్నారు. అయితే తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డిలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈక్రమంలోనే దర్శకుడు మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాల గురించి చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చి ప్రతీ రూపాయిని ఓ రెండు పనుల కోసం మాత్రమే ఉపయోగించబోతున్నట్లు వివరించారు.
గతంలో ప్రతీ టికెట్ పై ఐదు రూపాయలను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చిన తాము.. కేవలం ఆ ఒక్క గుడికే కాకుండా భద్రాచలం వంటి మరికొన్ని చిన్న ఆలయాలకు కూడా డొనేట్ చేయాలనుకున్నట్లు ప్రకటించారు. సినిమా చూసే ప్రతీ ఒక వ్యక్తి తమ వంతు సాయంగా దేవుడికి విరాళం ఇచ్చినట్లేనని చెప్పారు. అలాగే హనుమాన్ సినిమాపై వచ్చే ప్రతీ రూపాయని ఆ తర్వాత వచ్చే సీక్వెల్ చిత్రాలకే వాడుబోతున్నట్లు ప్రొడ్యూసర్ తనకు చెప్పారని అన్నారు.
ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కూడా అవునని చెప్పగా... హనుమాన్ సినిమాపై వచ్చిన ప్రతీ రూపాయని వేరే ఏ బిజినెస్ లకు కూడా వాడమని చెప్పారు. కేవలం ఆ తర్వాత వచ్చే సినిమాలు జై హనుమాన్, ఆపై వచ్చే చిత్రాలకు మాత్రమే వినిగిస్తారని వివరించారు. ఈ విషయాలు తెలుసుకున్న ప్రజలు, అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











