Prashanth Varma: రాజమౌళి రిజెక్ట్ చేశాడు.. అందుకే ఆయనపై కోపం.. ప్రశాంత్ వర్మ షాకింగ్ కామెంట్స్

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తుంది. చిన్న సినిమాగా వచ్చి... సంచలనం సృష్టిస్తుంది. అయితే ఈ సినిమా యూనిట్ ఇటీవల గ్యాటిట్యూడ్ మీట్ ను జరుపుకుంది. ఇక ఈ ఈవెంటుకు హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మతో సహా చిత్ర యూనిట్ అంతా వచ్చారు. ఇక ఈ ఈవెంట్లో ఎస్ఎస్ రాజమౌళిపై ప్రశాంత్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాల్లో హనుమాన్ ఒకటి. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. అ, జాంబీరెడ్డి సినిమాలతో తన సత్తా చూపిన ప్రశాంత్ వర్మ.. ఈ హనుమాన్ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన చిత్రమిది. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

HanuMan Director Prashanth Varma Shocking Comments on SS Rajamouli Full Details Here

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక త్వరలో రూ.300 కోట్ల మార్కు చేరుకునేందుకు పరుగులుపెడుతుంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా రికార్డు వసూళ్లు రాబడుతుంది. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ రికార్డులను కొల్లగొట్టింది ఈ చిత్రం. ఇప్పుడు తాజాగా 5 మిలియన్ డాలర్లను సాధించి.. సలార్ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీ అయిపోయింది.

మరోవైపు ఈ సినిమాను ఇప్పటి వరకు కోటి ఫుట్ ఫాల్స్ వచ్చాయి. అంటే కోటి మంది దీనిని వీక్షించారు. ఇక ఈ క్రమంలోనే నిన్న సక్సెస్ మీట్ జరుపుకుంది. ఇందులో చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న ప్రశాంత్ వర్మ.. దర్శక ధీరుడు రాజమౌళిపై సంచలన కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

HanuMan Director Prashanth Varma Shocking Comments on SS Rajamouli Full Details Here

అసలు విషయం ఏంటంటే... రాజమౌళి అంటే తనకెంతో ఇష్టమన్న ప్రశాంత్ వర్మ... జక్కన్న టీమ్‌ లోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని చెప్పుకువచ్చాడు. రాజమౌళి మేకింగ్‌ స్టైల్‌ నాకెంతో ఇష్టం... ఆయన వద్ద అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేయడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించానని తెలిపాడు. ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడే.. ఛాన్స్‌ కోసం మెయిల్స్‌ పంపించాను. కానీ నా అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారంటూ వివరించాడు.

రాజమౌళి తన టీమ్‌ లో ఖాళీ లేదని తెలిపారట. హార్డ్‌ వర్క్‌, టాలెంట్‌ ఉన్నా నన్నెందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఏకలవ్యుడు గుర్తుకువచ్చారని.... రాజమౌళి సినిమాలు, మేకింగ్‌ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ చెప్పుకువచ్చారు. పెద్ద హీరోలతో పని చేయడానికి వ్యతిరేకం కాదని... వాళ్లతో సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుందని అసలు విషయం తెలిపారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కామెంట్స్ వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X