Teja Sajja: రాజమౌళిని మర్చిపోయిన తేజ సజ్జా.. ఇండియాలో ఆ ఇద్దరే అంటూ.. నెటిజన్స్ ఫైర్!
దేశవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తున్న ఏకైక పేరు హనుమాన్. ఎక్కడ చూసిన ఈ పేరే వినిపిస్తుంది. చిన్న సినిమాగా విడుదల అయి... పెద్ద సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకోగా.. అందులో హీరో తేజ సజ్జా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఇద్దరే డైరెక్టర్ల పేర్లు వినిపిస్తాయంటూ... ప్రకటించాడు. అయితే ఈ విషయంపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఆస్కార్ తీసుకువచ్చిన రాజమౌళి పేరును ఎలా మరిచిపోతావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హనుమాన్ మూవీ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు.. పలు విదేశీ భాషల్లో రిలీజ్ అయింది. ఇక రిలీజ్ అయిన మొదటి నుంచే ఈ సినిమాకు మంచి పాజిటివ్ బజ్ లభించింది. తేజ సజ్జా హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించి మెప్పించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హీరో సినిమాలో పాపులర్ యాక్టర్ వినయ్ రాయ్ విలన్ గా నటించారు.

ఇక ఈ సినిమాకు ఆశేష ఆదరణ లభిస్తుంది. హనుమాన్ దాదాపుగా తొలిరోజున 15 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పక్కన పెడితే.. చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా, నిర్మాత నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఈ టికెట్ మీద వచ్చే ప్రతి రూపాయిని రామ మందిర నిర్మాణానికి ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ టికెట్ డబ్బులు డైరెక్టుగా వెళ్లడానికి ఓ లైవ్ వెబ్ సైట్ పెట్టనున్నట్లు తెలిపారు. ఇక ఈ సందర్భంగా తేజ సజ్జా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఇద్దరు డైరెక్టర్ల పేర్లు వినిపిస్తాయి. ఒకటి ప్రశాంత్ వర్మ కాగా.. మరొకటి ప్రశాంత్ నీల్ అంటూ చెప్పుకువచ్చారు. ఇక ఈ సినిమా ఏ ఓటీటీల్లో కానీ.. ఏ శాటిలైట్ టీవీల్లో కానీ 60 లేదా 70 రోజుల వరకు రాదు అంటూ చెప్పుకువచ్చాడు.

మీ అందరికీ అందుబాటు ధరలో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఉన్నాయి. ఇది ఒక స్టార్ సినిమా కాదు... అయినప్పటికీ అన్ని భాషల్లో మంచి ఆదరణ వస్తుంది. అందరికి ధాన్యవాదాలు.. మీ అందరికి ఈ సినిమా నచ్చుతుంది. అందరూ వచ్చి చూడండి అంటూ చెప్పుకువచ్చాడు. అయితే తేజ సజ్జా వ్యాఖ్యలపై ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇండియాలో ఇద్దరే డైరెక్టర్ల పేర్లు వినిపిస్తాయి అంటూ తేజ సజ్జా మాట్లాడటం వారికి నచ్చలేదని తెలుస్తోంది.
ఇక సోషల్ మీడియాలో మా రాజమౌళిని ఎలా మరిచిపోయావ్ తేజ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతినీ ప్రపంచ స్థాయికి గుర్తు చేసిన రాజమౌళి పేరును ఎలా మిస్ చేశావ్ అంటున్నారు. ఇక మరికొంత మంది ఫైర్ అవుతున్నారు కూడా. ఇక కొంత మంది తేజకు సపోర్ట్ ఇస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం తేజ సజ్జా కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











