HanuMan అయోధ్య రామమందిరానికి హనుమాన్ ఆర్థిక సాయం.. ఉడతాభక్తిగా నిర్మాత ఎంత ప్రకటించారంటే?
హనుమాన్... ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ సినిమా గురించే చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి ఏ సినిమా వచ్చిన తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తుంటారు. తేజ సజ్జా హీరోగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు నమోదు అయ్యాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఆంజనేయ స్వామిని సూపర్ హీరోగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈరేజే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈక్రమంలోనే ఈ చిత్ర బృందం ఓ అదిరిపోయే వార్తను తెలిపింది.
ముఖ్యంగా అయోధ్య రామ మందిన నిర్మాణం కోసం ఏర్పరిచిన ట్రస్టుకు తమ చిత్ర బృందం తరఫున ఆర్థిక సాయం చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే హనుమాన్ చిత్ర బృందం రామ మందిర నిర్మాణం కోసం ఎంత మొత్తంలో డబ్బు సాయం చేయబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్టుగా వచ్చారు. ఈక్రమంలోనే సినిమా గురించి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ... హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సమయంలోనే అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టడం అందులోనూ అక్షితలు పట్టుకునే ఈ ట్రైలర్ ను విడదల చేయడం జరిగింది. ఈక్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేత ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ చేయించారు. అదేంటో తెలిస్తే మాత్రం దేశ వ్యాప్తంగా ఉన్న ఆంజనేయ స్వామి భక్తులు చాలా హ్యాపీగా ఫీలవుతారు.
అదేంటంటే.. ఈ సినిమా విడుదల అయ్యాక ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు వచ్చే కలెక్షన్లలోంచి డబ్బులను అయోధ్య రామ మందిర ట్రస్టుకు ఇచ్చేస్తామని ప్రకిటంచారు. ముఖ్యంగా ప్రతీ టికెట్ పై వచ్చే ఐదు రూపాయలను స్వామి వారి ఆలయ ట్రస్టుకు ఇస్తామని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించారు. ఈ విషయాన్ని నేరుగా చిరంజీవియే సభాముఖంగా ప్రకటించారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన పాన్ వరల్డ్ గా విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొట్టునుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











