Ayodhya Ram Mandir: హనుమాన్ బంపర్ ఆఫర్.. సగం ధరకే టికెట్లు.. ఏ థియేటర్లలో అంటే!
దేశ వ్యాప్తంగా ఇప్పుడు సెన్సేషన్ అవుతోన్న పేరు రెండే రెండు. అందులో ఒకటి అయోధ్య రామ మందిరం కాగా.. రెండో హనుమాన్ మూవీ. అంతలా రియల్ సూపర్ హీరో ఆంజనేయ స్వామి నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఇండియా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ స్పందనను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.
డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా చేసిన సినిమానే 'హనుమాన్'. సోషియో ఫాంటసీ జోనర్‌లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పటికే రూ. 90 కోట్లకు పైగా వరకూ షేర్‌ను వసూలు చేసింది. తద్వారా రూ. 50 కోట్లకు పైగా లాభాలను అందుకుంది.

'హనుమాన్' మూవీ సౌత్‌లో మాదిరిగానే నార్త్ ఇండియాలో సైతం బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. దీనికి కారణం అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతుండడం అని చెప్పొచ్చు. ఈ మహోన్నత కార్యక్రమం వల్ల కొద్ది రోజులుగా దేశం మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఇది 'హనుమాన్' మూవీకి బాగా కలిసి వస్తోంది.
అయోధ్యలో జరగనున్న మహోన్నత ఘట్టాన్ని పురస్కరించుకుని జనవరి 22వ తేదీన 'హనుమాన్' మూవీపై అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే మిరాజ్ సంస్థ ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అనే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు యూఎస్‌లోని కొన్ని లొకేషన్లలో సగం ధరకే 'హనుమాన్' టికెట్లను అందిస్తున్నట్లు పలు సంస్థలు ప్రకటించాయి.

యూఎస్‌లో పెద్ద పేరున్న యాపిల్ సినిమాస్ ఎనిమిది లొకేషన్లలో జనవరి 22వ తేదీకి సంబంధించి 'హనుమాన్' టికెట్లను సగం ధరకే అందిస్తుంది. అలాగే, సినీ లాంజ్ రెండు లొకేషన్లలో, బీ అండ్ బీ థియేటర్స్ ఒక లొకేషన్‌లో ఈ ఆఫర్‌ను తీసుకు వచ్చాయి. అయితే, కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుందని ఈ సంస్థలు తెలిపాయి.
ఇదిలా ఉండగా.. రియల్ సూపర్ హీరో స్టోరీతో రూపొందిన 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











