Prasanth Varma: హనుమాన్ డైరెక్టర్ మరో బడా ప్రాజెక్ట్.. బాబు రెడీ బాబు అంటూ!

టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది యంగ్ డైరెక్టర్లు మాత్రమే ప్రత్యేకమైన పంథాను ఫాలో అవుతూ మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ ప్రశాంత్ వర్మ ఒకడు. 'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి విభిన్న తరహా ప్రయోగాత్మక సినిమాలను రూపొందించి విశేషమైన గుర్తింపును దక్కించుకున్న అతడు.. ఇటీవలే 'హనుమాన్'తో వచ్చి సెన్సేషన్ అయ్యాడు. ఇక, తాజాగా ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే...

తేజ సజ్జా హీరోగా నటించిన రియల్ సూపర్ హీరో మూవీనే 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ లభించింది. అందుకు అనుగుణంగానే ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ భారీగా వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

HanuMan Movie Director Prasanth Varma Tweet Creates Curiosity

'హనుమాన్' మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రశాంత్ వర్మ దీనికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు. ఇదే విషయాన్ని ఆ మూవీ ఎండ్ కార్డ్‌లో సైతం చూపించారు. దీంతో అతడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే తాజాగా ప్రశాంత్ వర్మ ఓ ట్వీట్‌ చేశాడు.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా తన X (ట్విట్టర్) ఖాతాలో షూటింగ్ స్పాట్‌లో ఉన్న ఓ ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు, దీనికి 'నాకు ఇష్టమైన ప్లేస్‌కు వచ్చాను. బాబు రెడీ బాబు' అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో అతడు దేనికి సంబంధించిన షూటింగ్ చేస్తున్నాడు? ఎవరితో చేస్తున్నాడు? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

ప్రశాంత్ వర్మ తాజాగా షేర్ చేసిన ఫొటో, అతడు పెట్టిన క్యాప్షన్ చూస్తుంటే.. ఇది నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' (Unstoppable with NBK) షోకు సంబంధించిన షూట్ అని అర్థం అవుతోంది. ఎందుకంటే గతంలో వచ్చిన అన్ని సీజన్లకు ప్రశాంత్ వర్మ తెర వెనుక ఉండి వర్క్ చేశాడు. దీంతో ఇప్పుడు కూడా ఆ పనిలోనే ఈ యంగ్ డైరెక్టర్ ఉన్నాడని చాలా మంది అనుకుంటున్నారు. మరి దీనిపై ప్రశాంత్ క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X