Hanuman: ఒక్కరోజు ముందుగానే "హునుమాన్".. కానీ వాళ్లకు మాత్రమే చూసే అవకాశం, ఎందుకంటే?
తేజ సజ్జా హీరోగా రాబోతున్న తాజా చిత్రం హనుమాన్. ఈ సినిమా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున అంచనాలు నమోదు అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది. కానీ కొందరికి మాత్రం ఒక్కరోజు ముందుగానే ఈ సినిమాను చూసేయచ్చు. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా.. రాజు తలారి ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. విజ్యువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ గా రూపొందించగా.. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాను ఒక్కరోజు ముందుగానే చూడవచ్చని.. తెలంగాణలోని పలు చోట్ల ప్రీమియర్ షోలు వేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎక్స్ వేధికగా ప్రకటించింది. జనవరి 9వ తేదీ ఉదయం 11 గంటలకు పెయిడ్ ప్రీమియర్ లు వేస్తున్నట్లు చెప్పి రెడీగా ఉండమని వివరించింది. సంధ్య 70 ఎంఎం, ఎస్టీబీఎల్ సినీ వరల్డ్, ఎస్వీసీ సినిమాస్, సినీ ప్రైమ్ స్క్రీన్, భ్రమరాంబ, శరత్ థియేటర్స్, జగదాంబ 70 ఎంఎం, శ్రీ మెలోడీ హైదరాబాద్ కు చెందిన మరో రెండు థియేటర్లలో కూడా ఈ టికెట్లను విడుదల చేశారు.
అయితే కరెక్టుగా 11 గంటలకే టికెట్లను అందుబాటులో ఉంచగా.. గంటోలనే ఆ టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. 12వ తేదీన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా ఉండడంతో ఎక్కువ మంది ఒక్క రోజు ముందుగానే హనుమాన్ చూసి ఆ తర్వాతి రోజు గుంటూరు కారం చూడాలని ప్లాన్ చేసుకున్నట్లు అర్థం అవుతంది. హనుమాన్ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడగా.. మరికొన్ని థియేటర్లలో కూడా ప్రీమియర్ షోలు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

మరోవైపు ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా టీజర్, పోస్టర్, ట్రైలర్ లకు విపరీతమైన స్పందన వచ్చింది. వీటితో జనాల్లో కూడా అంచనాలు రెట్టింపు అయ్యాయి. అందుకే సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. చూడాలి మరి జనవరి 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కానుందనేది.


Click it and Unblock the Notifications











