హనుమాన్ సెన్సేషన్.. జోష్‌లో డైరెక్టర్‌కు 6 కోట్ల గిఫ్ట్..ఎవరు, ఏమిచ్చారో తెలుసా?

హనుమాన్ సినిమా విడుదల అయి 20 రోజులు అవుతున్నా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతూనే ఉంది. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. కేవలం 40 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఎవరూ ఊహించని స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా వల్ల ప్రొడ్యూసర్ చాలా లాభ పడ్డాపట. పెద్ద ఎత్తున లాభాలు వస్తుండడంతో ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి డైరెక్టర్ కు ఓ స్పెషల్ గిఫ్టు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తేజా సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. అలాగే ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించారు. తేజా సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదలైంది. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచి అనేక రికార్డులను క్రియేట్ చేసింది.

Hanuman Movie Producer Gave 6 Crores Value Gift to Director Prashanth Varma

అయితే దర్శక, నిర్మాతలతో పాటు సినిమాలోనీ హీరోహీరోయిన్లు.. సక్సెస్ మీట్స్ లో పాల్గొంటూనే ఉన్నారు. ఇటీవలే ప్రొడ్యూసర్ కేవలం అయోధ్య రామ మందిర ట్రస్టుకే కాకుండా భద్రాచలం వంటి చిన్న ఆలయాలకు కూడా డబ్బులు విరాళంగా ఇస్తామని చెప్పారు. అలాగే హనుమాన్ సినిమాపై వచ్చే ప్రతీ రూపాయిని.. రాబోయే హనుమాన్ చిత్రాలకే వినియోగిస్తామని కూడా వివరించారు. అయితే తనకు ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు స్పెషల్ సర్ ప్రైజే ఇవ్వాలని భావించారట.

Hanuman Movie Producer Gave 6 Crores Value Gift to Director Prashanth Varma

ఈక్రమంలోనే ఆరు కోట్ల రూపాయల విలువ చేసే ఓ కాస్ట్లీ కారును బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నారట. అనుకోవడం కాదు.. అందుకోసం ఆయనే ఓ స్పెషల్ కారును కూడా బుక్ చేశారట. అతి త్వరలోనే ఆ కారు తన వద్దకు రావడం... ఆయనే నేరుగా వెళ్లి కారును డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అందిస్తారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. సాధారణంగా ఏవైనా సినిమాలు హిట్టుగా నిలిచి బాగా లాభాలు వస్తే డైరెక్టర్ తో పాటు.. హీరో, హీరోయిన్లకు బహుమతులు ఇవ్వడం ఎప్పటి నుంచో వస్తోంది. చూడాలి మరి ప్రశాంత్ వర్మ ఏ కారును అందుకోబోతున్నారనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X