హనుమాన్ మ్యాజిక్‌‌కు థియేటర్లన్నీ ఫుల్.. 24 గంటల్లోనే అన్ని లక్షల టికెట్లు బుక్!

2024 సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం ఆరు చిత్రాలు విడుదల అయ్యాయి. అయితే ప్రజలు మాత్రం తమకు నచ్చిన చిత్రాలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమానో లేదంటా పాటిజివ్ టాక్ వచ్చిన సినిమానో చూసేందుకు మాత్రం జనాలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈక్రమంలోనే పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో.. అంటే జనవరి 19వ తేదీ ఉదయం నుంచి జనవరి 20వ తేదీ ఉదయం వరకు ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి.. ఏ సినిమాను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గడిచిన 24 గంటల్లలో బుక్ మై షోలో ఎక్కువగా బుక్ అయిన టికెట్లు, ఏయే సినిమాల టికెట్లు అందుబాటులో ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఎప్పటిలాగే తేజా సజ్జా హీరోగా చేసిన హనుమాన్ దూసుకుపోతుంది. కుర్ర హీరో సినిమాకు వస్తున్న క్రేజ్ కు స్టార్ హీరోల సినిమాలు సైతం సైడ్ అవుతున్నాయి. ఈ సినిమా చూసేందుకు అనేక మందికి టికెట్లు కూడా దొరకడం లేదు. ముఖ్యంగా టికెట్లను ఇలా అందుబాటులో పెట్టగానే.. అలా టికెట్లు అన్నీ అయిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక్క హనుమాన్ సినిమాకే 312.84కే టికెట్లు బుక్ అయ్యాయి. అంటే 3 లక్షల 12 వేల 840 టికెట్లు అమ్ముడు పోయాయి.

Hanuman Movie Sold Most Tickets in Sankranthi 2024 Cinemas And List is Here Check Details

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమా టాప్ 2లో నిలిచింది. మొదటి రోజు ఒక్కరోజే టాప్ లో ఉన్న ఈ సినిమా ఆ తర్వాత నుంచి హనుమాన్ దెబ్బకు టాప్ 2కు పడిపోయింది. గత 24 గంటల్లో ఈ సినిమాను చూసేందుకు 32.78కే మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. అంటే 32 వేల 780 మంది బుక్ మై షో ద్వారా ఈ సినిమాను చూడనున్నారు. అలాగే శివకార్తికేయన్ హీరోగా చేసిన అయలాన్ సినిమా టాప్ 3లో నిలవగా.. గడిచిన 24 గంటల్లో 28.54కే మంది ఒక్క బుక్ మై షో ద్వారానే టికెట్లు బుక్ చేసుకున్నారు. అంటే 28 వేల 540 మంది ఈ సినిమాను చూడనున్నారు.

ఆ తర్వాతి స్థానంలో అంటే టాప్ 4లో నాగార్జున హీరోగా చేసిన నా సామి రంగా నిలిచింది. సినిమా విడుదలకు ముందు పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయిన ఈ సినిమా విడుదల తర్వాత బానే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాను చూసేందుకు గడిచిన 24 గంటల్లో 16.51కే టికెట్లు బుక్ అయ్యాయి. అంటే 16 వేల 510 మంది ఈ సినిమాను చూసేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు.

Hanuman Movie Sold Most Tickets in Sankranthi 2024 Cinemas And List is Here Check Details

అలాగే ధనుష్ హీరోగా చేసిన కెప్టెన్ మిల్లర్ సినిమా టాప్ 5లో నిలిచింది. గత 24 గంటల్లో కెప్టెన్ మిల్లర్ కు చెందిన 9.79కే టికెట్లు బుక్ అయ్యాయి. అంటే 9 వేల 790 మంది ఈ సినిమా చూడాలని టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇక విక్టరీ వెంకటేషన్ హీరోగా వచ్చిన సైంధవ్ సినిమా టాప్ 6లో చివరగా నిలిచింది. ఈ సినిమా చూసేందుకు కేవలం 5.38కే మంది మాత్రమే టికెట్లు బుక్ చేసుకున్నారు. అంటే 5 వేల 380 మంది మాత్రమే గడిచిన 24 గంటల్లో ఈ సినిమాను చూశారు. హనుమాన్ తప్ప మిగిలిన 5 సినిమాల టికెట్లు అన్నీ కలిసి కేవలం లక్ష కూడా కాకపోగా.. ఒక్క హనుమాన్ కే 3 లక్షలకు పైగా టికెట్లు రావడం చూస్తుంటేనే ఆ సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ వస్తుందో అర్థం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X