చివరి నిమిషంలో HanuMan షాకింగ్ డెసీషన్.. భారీగా టికెట్ల ధరలు తగ్గింపు.. కారణం ఏంటంటే?
తేజా సజ్జా హీరోగా వచ్చిన తాజా సినిమా హనుమాన్ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతూనే ఉంది. సినిమా విడుదల అయి నెల దాటిపోతున్నా... ఏమాత్రం వసూళ్లు తగ్గట్లేదు. ఇప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. అయితే మరికొద్ది రోజుల్లో 50 రోజులకు దగ్గరగా వస్తున్న ఈ సినిమా తాజాగా ఓ అదిరిపోయే ప్లాన్ వేసింది. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ .. సినీ ప్రియులు మరోసారి సినిమా చూసేలా ప్లాన్ చేస్తోంది. అలాగే ఇప్పటి వరకు సినిమా చూడని వాళ్లు కూడా చూసేలా బంపరాఫర్ ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తేజా సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదలైంది. సూపర్ డూపర్ హిట్టుగా నిలిచి అనేక రికార్డులను క్రియేట్ చేసింది.

ప్రస్తుతం ఆరో వారంలో అడుగు పెడుతున్న హనుమాన్.. టికెట్ల ధరలను తగ్గిస్తూ.. మళ్లీ జనాలను థియేటర్లకు రప్పించుకునేందుకు ప్లాన్ చేశారు. ముఖ్యంగా నైజాంలో 75 నుంచి 145 రూపాయల వరకు తగ్గించి సేన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ లపై 75 రూపాయలు తగ్గించారు. తగ్గించకముందు 175 రూపాయలుగా ఉన్న టికెట్ ధర.. ప్రస్తుతం రూ.100గా మారింది. అలాగే మల్టీప్లెక్సుల్లో 145 రూపాయలు తగ్గించారు. అలా 295 రూపాయలుగా ఉన్న టికెట్ ధర రూ. 150 గా మారింది. అయితే ఈ ఆఫర్ ఫిబ్రవరి 16 నుంచి 23వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
హనుమాన్ టీం ఈ ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి సినీ ప్రియులు అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఇప్పటి వరకు సినిమా చూడని వారు టికెట్ల ధరలు తగ్గించడంతో కచ్చితంగా చూడాలని అనుకుంటున్నారు. అలాగే ఇప్పటికే ఓసారి చూసిన వాళ్లు కూడా మరోసారి థియేటర్ కు వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల భారీ ఎత్తున కలెక్షన్లు రాకపోయినప్పటికీ.. థియేటర్ల మెయింటెన్స్ కు సరిపడా డబ్బులు వస్తాయి. ఇలా ధరల తగ్గించడం వల్ల లాభాలు కూడా పెరుగుతాయి.

మరో పదిహేను రోజుల పాటు హనుమాన్ థియేటర్లలో సందడి చేసే అవకాశం కనిపిస్తుండగా.. చివరి నిమిషంలో అద్భుతమైన ప్లాన్ వేసి క్యాష్ చేసుకుంటున్నారు మూవీ టీం వాళ్లు. దీని వల్ల అటు సినీ ప్రియులతో పాటు ఇటు చిత్ర నిర్మాతలకు కూడా బానే లాభం కలిసి వస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.


Click it and Unblock the Notifications











