Ayodhya Ram Mandir: బాల రాముడి కోసం హనుమాన్.. ఏకంగా అన్ని కోట్లు విరాళంగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్రాంచైజీ మూవీలు ఇప్పుడిప్పుడు ప్రారంభం అవుతున్నాయి. కొంత మంది దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన యూనివర్శ్‌ను క్రియేట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ప్రశాంత్ వర్మ ఒకడు. సూపర్ హీరోస్ సిరీస్‌లలో సినిమాలు చేయడానికి చూస్తున్న అతడు.. మొదటి ప్రయత్నంలో భాగంగా 'హనుమాన్' అనే సినిమాను చేశాడు.
రియల్ సూపర్ మ్యాన్ అయిన ఆంజనేయస్వామి నేపథ్యంతో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రమే 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా మామూలు అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో అప్పటి నుంచి ఆడియెన్స్ ద్వారా భారీ స్పందన లభిస్తోంది. దీంతో వసూళ్లూ వస్తున్నాయి.

క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'హనుమాన్' మూవీకి వరల్డ్ వైడ్‌గా భారీ స్పందన లభిస్తోంది. దీంతో ఈ మూవీకి రికార్డు స్థాయి వసూళ్లు లభిస్తున్నాయి. ఇలా ఈ చిత్రం ఇప్పటికే రూ. 90 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. తద్వారా రూ. 50 కోట్లకు పైగా లాభాలను కూడా సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఎన్నో రికార్డులను సైతం నమోదు చేసి చరిత్రను సృష్టించింది.
'హనుమాన్' మూవీకి సంబంధించి ప్రతి టికెట్‌పై వచ్చే డబ్బుల్లో 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తామని చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన అమౌంట్‌లో 14,85,810 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు ఓ చెక్‌ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు.

ముందుకు చెప్పినట్లుగానే అయోధ్య రామ మందిరం కోసం 'హనుమాన్' చిత్ర యూనిట్ మరోసారి భారీ విరాళం ఇచ్చింది. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి 53,28,211 టికెట్లు అమ్ముడయ్యాయట. వీటి ద్వారా వచ్చిన వాటిలో 2,66,41,055 రూపాయలను మూవీ యూనిట్ ఇప్పుడు మళ్లీ విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా వర్క్ చేశారు.


Click it and Unblock the Notifications











