HanuMan: ఎవరైతే స్క్రీన్లు ఇవ్వనన్నారో.. వాళ్ల థియేటర్లే ఓపెన్ చేశారు.. ఇది కదా హనుమాన్ సక్సెస్

దేశం మొత్తం ఇప్పుడు వినిపిస్తున్న పేరు హనుమాన్.. హనుమాన్.. హనుమాన్.. ఒకవైపు రామమందిర ప్రారంభోత్సవం.. మరోవైపు దేశంలో హనుమాన్ సినిమా హవా. ఇదిలా ఉంటే.. హనుమాన్ సినిమాకు ఒకప్పుడు స్క్రీన్లు ఇవ్వని థియేటర్.. ఇప్పుడే అదే థియేటర్స్ చైన్ ని హైదరాబాద్ లో హను మాన్ చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఇది తెలుసుకున్న నెటిజన్స్.. ఇది కదా సక్సెస్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

హనుమాన్ సినిమా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంది. ఓ చిన్న సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హవాను కొనసాగిస్తుంది. జనవరి 12న గుంటూరు కారం సినిమాకు పోటీగా హనుమాన్ చిత్రం రిలీజ్ అయింది. సరిగ్గా థియేటర్లు కూడా ఆ సినిమాకు లేవు. ఇక గుంటూరు కారంతో పాటు.. నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్ చిత్రాలు కూడా పోటీకి దిగాయి.

HanuMan Movie Team Success Story: They Are Asian Cinemas opened in Hyderabad

ఇక స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి.. హనుమాన్ చిత్రం కోట్లలో వసూళ్లు రాబడుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు.. పలు విదేశీ భాషల్లో రిలీజ్ అయింది. ఇక ఈ చిత్రంలో తేజ సజ్జా.. సూపర్ హీరోగా కనిపించాడు. ఆయన సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో విలన్ గా వినయ్ రాయ్ నటించాడు. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా రూ. 60 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అమెరికాలో 4 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి... స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఊహించని రన్ తో అయితే తెలుగు రాష్ట్రాల్లో, యూఎస్ మార్కెట్ లో దూసుకెళ్తుంది హనుమాన్. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

HanuMan Movie Team Success Story: They Are Asian Cinemas opened in Hyderabad

ఇక ఈ సినిమా భారీ సక్సెస్ స్టోరీలో ఒక ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకుంది. సినిమా విడుదలకు ముందు ఈ సినిమాకు థియేటర్లు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదు. ముఖ్యంగా ప్రముఖ మల్టిప్లెక్స్ సంస్థ ఆసియన్ సినిమాస్ లో హను మాన్ కి అసలు స్క్రీన్స్ ఇవ్వని పరిస్థితి అప్పట్లో నెలకొంది. కానీ సీన్ కట్ చేస్తే మెల్లగా హను మాన్ హవా పెరగడంతో.. ఆ సంస్థ దిగొచ్చింది. అదే ఆసియన్ సినిమాస్ కొత్త థియేటర్స్ చైన్ ని హైదరాబాద్ లో హను మాన్ టీమ్ ప్రారంభించింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న హనుమాన్ ఫ్యాన్స్... ఎవ్వరైతే హనుమాన్ సినిమాకు స్క్రీన్స్ ఇవ్వను అని చెప్పారో.. వారే ఈ థియేటర్స్ చైన్ ను హనుమాన్ టీమ్ తో ఓపెన్ చేయించారు. ఇది కదా హనుమాన్ సక్సెస్ అంటే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X