జై హనుమాన్ మూవీలో మెగా హీరో.. సైలెంట్ గా లీక్ చేసిన ప్రొడ్యూసర్

ఇండియన్ సినిమా దగ్గర దాదాపు ఇప్పుడు అన్ని జానర్ సినిమాలు కూడా టచ్ చేసేసారు. ఇప్పుడు యువ దర్శకులు కూడా ఎక్కువ అవుతుండడంతో అతి తక్కువగా టచ్ చేసిన సబ్జెక్టులు కూడా తాము టచ్ చేసి అదరగొడుతున్నారు. ఐతే ఇండియన్ సినిమా దగ్గర చాలా తక్కువగా టచ్ చేసి తెలుగు సినిమాలో అసలు ముట్టేకోని జానర్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ హీరో జానర్ అని చెప్పాలి.

కాగా ఇది చాలా డిఫికల్ట్ సబ్జెక్టు కావడం ఇండియన్ సినిమా దగ్గర హిట్ రేట్ కూడా చాలా తక్కువే ఉండడంతో పలువురు నిర్మాతలు కూడా చేసేందుకు సాహసం చేయలేదు. కానీ మన తెలుగు నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో చిత్రం "హను మాన్" అన్ని అపోహలు బ్రేక్ చేసి ఒక సంచలన విజయాన్ని నమోదు చేసింది. కొడితే ఒకే దెబ్బకి యంగ్ హీరో తేజ సజ్జ ఇంకా దర్శకుడు ప్రశాంత్ వర్మ లు బాక్సాఫీస్ దగ్గర 300 కోట్ల క్లబ్ లో చేరిపోయారు.

Hanuman producer leaks ram charan as hanuman in sensational project jai hanuman

ఇంతలా సెన్సేషన్ ని ఈ సినిమా రేపగా ఈ సూపర్ హీరో సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ హనుమాన్ ఫ్యాక్టర్ అని తెలిసిందే. కాగా ఈ పాత్రకి అయితే అప్పుడు జెనరేట్ అయ్యిన సస్పెన్స్ అంతా ఇంతా కాదు. చాలా మంది అది మెగాస్టార్ చిరంజీవే అనుకోని సినిమాకి వెళ్లిన వారు కూడా లేకపోలేరు. ఆ రేంజ్ లో సస్పెన్స్ ని హైప్ ని బిల్డప్ చేసిన ఈ పాత్ర దీనికి సీక్వెల్ "జై హనుమాన్" లో అత్యంత కీలకంగా మారనుంది.

కాగా ఈ భారీ చిత్రంలో ఆ పవర్ఫుల్ రోల్ ని ఎవరు చేస్తే బాగుటుంది అనే ప్రశ్నకి స్వయంగా ఆ సినిమా నిర్మాతే సమాధానం ఇచ్చారు. నిర్మాత చైతన్య తాజాగా మాట్లాడుతూ అసలు హనుమంతుని పాత్రలో రామ్ చరణ్ గారు చేస్తే చాలా బావుంటుంది అని తెలిపారు. అంతే కాకుండా అదే పాత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు అయినా కూడా పర్ఫెక్ట్ గా సరిపోతారు అని తెలిపారు.

Hanuman producer leaks ram charan as hanuman in sensational project jai hanuman

దీనితో ఈ బ్రహ్మాండంలో మెగా హీరోస్ లో ఎవరొకరు భాగం అయ్యే అవకాశాలు ఇప్పుడు మెండుగా కనిపిస్తున్నాయి. చిరు, రామ్ చరణ్ ఎవరు ఈ రోల్ లో కనిపించినా సరే బాక్సాఫీస్ బద్దలైపోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు. ఏమి లేకుండానే 300 కోట్లకి పైగా వసూళ్లు వారు అందుకున్నారు అదే వీరి ఫ్యాక్టర్ కూడా పడితే మాత్రం బాక్సాఫీస్ జాతరే అని చెప్పాలి.

Hanuman producer leaks ram charan as hanuman in sensational project jai hanuman

మరి స్వయంగా నిర్మాతే ఈ కామెంట్స్ చేశారు కాబట్టి డెఫినెట్ గా రామ్ చరణ్ ని దాదాపు ఆ రోల్ లో ఆశించవచ్చు. మరి అన్నిటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. కాగా ఇప్పుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సహా మరో కొన్ని ప్రాజెక్ట్ లలో బిజీగా ఉండగా తేజ సజ్జ మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ "మిరాయ్" లో బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Read more about: ram charan teja sajja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X