twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Hanu-Man: హనుమంతును పరిచయం చేసిన ప్రశాంత్.. ఇది పాన్ ఇండియా మెటీరియల్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఈ మధ్య కాలంలో ఎన్నో వచ్చాయి. మన సినిమా స్టామినాను పరిచయం చేస్తూ అవన్నీ దేశ వ్యాప్తంగా సత్తా చాటాయి. దీంతో మన హీరోల మార్కెట్ గణనీయంగా పెరగడంతో పాటు తెలుగు సినిమాలపై అందరి దృష్టి పడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌కు చెందిన దర్శక నిర్మాతలు పాన్ ఇండియా సినిమాల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమ తమ చిత్రాలను పలు భాషల్లో తీసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా భారీ రేంజ్‌లో రాబోతుంది. అదే 'హనుమాన్' మూవీ.

    Bigg Boss: పర్సనల్ విషయాలపై లేడీస్ పచ్చి మాటలు.. వాడుకుని వదిలేయ్ అంటూ ఆమెతో దారుణంగా!Bigg Boss: పర్సనల్ విషయాలపై లేడీస్ పచ్చి మాటలు.. వాడుకుని వదిలేయ్ అంటూ ఆమెతో దారుణంగా!

    కెరీర్ ఆరంభం నుంచి విలక్షణ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. దర్శకుడిగా ఎంతో మంచి పేరును సంపాదించుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పటికే 'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి విభిన్న తరహా ప్రయోగాత్మక చిత్రాలు చేసిన అతడు.. పలు విజయాలను కూడా అందుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా 'హనుమాన్' అనే సినిమాను చేస్తున్నాడు. రియల్ సూపర్ హీరోగా పేరున్న హనుమంతుడి కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే దీని నుంచి విడుదలైన మోషన్ పోస్టర్.. ఈ చిత్రంపై అంచనాలను పెంచేసింది.

    Hanumanthu First Look Released from Hanu-Man Movie

    'హనుమాన్' మూవీని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ వల్ల అది సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టారు. ఎంతో గ్రాండ్‌గా మొదలైన ఈ మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి హీరో పాత్ర హనుమంతు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందుకోసం ఓ వీడియోను సైతం వదిలారు. అంతేకాదు, ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ అదిరిపోయే ప్రకటన కూడా చేసింది.

    <strong>బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి: ఆ శృంగారం ఎలా చేస్తారో వివరిస్తూ వీడియో.. అక్కలు, ఆంటీల కోసమే అంటూ!</strong>బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి: ఆ శృంగారం ఎలా చేస్తారో వివరిస్తూ వీడియో.. అక్కలు, ఆంటీల కోసమే అంటూ!

    తాజాగా విడుదలైన 'హనుమాన్' వీడియోలో తేజ సజ్జా ఉండేలును చేతిలో పట్టుకుని దేన్నో వేటాడుతూ కనిపించాడు. దీన్ని ఎంతో అడ్వెంచర్‌గా తీసి చూపించారు. ఇందులో అతడి లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఇక, ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నట్లు కూడా చిత్ర యూనిట్ వెల్లడించింది. అంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది ఇండియాలోనే మొట్టమొదటి రియల్ సూపర్ హీరోకు సంబంధించిన పాన్ ఇండియా సినిమా అని సగర్వంగా ప్రకటించుకున్నారు. ఇక, ఈ వీడియోతో 'హనుమాన్' మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.

    సూపర్ హిట్ కాంబినేషన్‌లో ఎంతో భారీగా రాబోతున్న 'హనుమాన్' మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా హాలీవుడ్ మూవీస్ 'స్పైడ‌ర్‌మ్యాన్‌', 'బ్యాట్‌మ్యాన్' రేంజ్‌లో ఉంటుందని, విజువల్ వండర్‌గా ఉంటూనే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా దీన్ని రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఇక, ఈ సినిమాకు అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. నటీనటుల వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.

    English summary
    Talented director Prasanth Varma New Movie with Original Superhero Story Title is HANU-MAN. Now Hanumanthu First Look Released From This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X