Happy Birthday Brahmanandam: రిచేస్ట్ కమెడియన్ .. అప్పట్లోనే షాకింగ్ రెమ్యునరేషన్!

తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా బెస్ట్ కమెడియన్స్ లిస్టు తీస్తే అందులో బ్రహ్మానందం పేరు టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. అందరికంటే ఎక్కువ స్థాయిలో సినిమాలు చేసిన కమెడియన్స్ లలో బ్రహ్మానందం రికార్డు క్రియేట్ చేశారు. ఇక నేడు ఆయన 66వ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు అభిమానులు ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు. ఇక బ్రహ్మానందం రెమ్యునరేషన్ ఎంత? ఆయన ఆస్తుల వివరాలు ఎంత ఉండవచ్చు అనే వివరాల్లోకి వెళితే...

వెయ్యికి పైగా సినిమాలు

వెయ్యికి పైగా సినిమాలు

హాస్య బ్రహ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న బ్రహ్మానందం అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. కేవలం ఆయన కోసం సినిమా చూస్తే ఆడియెన్స్ కూడా ఒకప్పుడు థియేటర్ కు వచ్చేవారు. ఏరికోరి మరి దర్శకులు హీరోలు కూడా ఆయనను సెలెక్ట్ చేసుకునేవారు. ఇక ఆయన ఇన్నేళ్ళ కెరీర్ లో మొత్తంగా 1000కి పైగా సినిమాలు చేసి గిన్నిస్ రికార్డును అందుకున్నారు.

ఆ సినిమాతో కెరీర్ యూ టర్న్

ఆ సినిమాతో కెరీర్ యూ టర్న్

మొదట జంధ్యాల సినిమాల ద్వారానే బ్రహ్మానందం మంచి క్రేజ్ అందుకున్నాడు. ముఖ్యంగా ఆహా నా పెళ్ళంట సినిమా ద్వారా ఆయన కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. 1987 లో మొదలైన బ్రహ్మానందం కెరీర్ ఆ తరువాత గ్యాప్ లేకుండా కొనసాగింది. ఏడాది 20 కి పైగా సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమలో అందరి హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటూ వచ్చారు.

ఇప్పటికి అదే క్రేజ్

ఇప్పటికి అదే క్రేజ్

బ్రహ్మానందం కెరీర్ లో ఎన్నో మర్చిపోలేని హిట్స్ ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికి ఆయన పాత్రలతో ఎన్నో మీమ్స్ వస్తుంటాయి. 70 శాతం మీమర్స్ బ్రహ్మానందం ఫొటోలు లేకుండా మీమ్స్ క్రియేట్ చేయడం లేదు. ఇక ఆ తరహాలో ప్రస్తుతం ఆయనకు మంచి క్రేజ్ అందుతోంది. సినిమాలు తగ్గించినా ఇంకా బ్రహ్మానందం పేరు వినిపిస్తూనే ఉంది.

మర్చిపోలేని హిట్ సినిమాలు.. రెమ్యునరేషన్

మర్చిపోలేని హిట్ సినిమాలు.. రెమ్యునరేషన్

ఇక బ్రహ్మానందం శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసిన వెంకీ, దుబాయ్ శీను, ఢీ, దూకుడు వంటి సినిమాల్లో మంచి కామెడీని అందుకున్నారు. అదుర్స్, జల్సా సినిమాల్లో కూడా ఆయన కామెడీ హైలెట్ అయ్యింది. కొన్ని సినిమాలు బ్రహ్మానందం ద్వారా సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక అప్పట్లో ఆయన ఒక్కో సినిమాకు డైలీ 10 నుంచి 20 లక్షలు అందుకునేవారు. ఇక మొత్తం కాల్షీట్స్ తో కొన్ని సినిమాలకు 2 కోట్ల రెమ్యునరేషన్స్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి.

 అస్ర్హులు

అస్ర్హులు

ఇక బ్రహ్మానందం సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజు సినిమాలతో మంచి ఆదాయాన్ని అందుకున్నారు. ఆయన ఆస్తులు ఇప్పటివరకు 300 కోట్ల నుంచి 400 కోట్ల మధ్యలో ఉంటుంది అని తెలుస్తోంది. అంతేకాకుండా డబ్బులు పొదుపు చేయడంలో కూడా ఆయన చాలా తెలివిగా ఆలోచిస్తారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు.

మెగాస్టార్ స్పెషల్ విషెస్

మెగాస్టార్ స్పెషల్ విషెస్

ఇక బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా స్టార్స్ ఆయనకు విషస్ అందించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేకంగా బ్రహ్మానందం కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ కూడా బ్రహ్మానందం దగ్గరికి వచ్చి బర్డ్ డే విషెస్ లో అందించారు అంతేకాకుండా ఫోటోలకు స్టిల్ కూడా ఇచ్చారు. ఆ ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసుకొని ప్రత్యేకంగా విషెస్ అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X