twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy birthday Dhanush ఆకట్టుకొన్న ధనుష్.. సార్ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!

    |

    జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత ధనుష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సార్ (తమిళంలో వాతీ) చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నది. ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సారికా స్టూడియోస్ బ్యానర్‌పై వెంకీ అట్లూరీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నది.

    యాంబిషయస్ జర్నీ ఆఫ్ కామన్ మ్యాన్ ఉపశీర్షికతో వచ్చిన టైటిల్ రివీల్ వీడియో సార్ సినిమాపై అంచనాలు పెంచింది. విద్యావ్యవస్థ నేపథ్యంగా క్యాంపస్ పరిధిలో జరిగే కథ విభిన్నంగా కనిపించింది. ఇక ధనుష్ బర్త్ డే పురస్కరించుకొని సర్ (వాతి) సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

    సార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ అంచనాలకు తగినట్టుగానే ఉందనే ఫీలింగ్ కల్పించింది. లైబ్రరీ మధ్యలో పుస్తకాల మధ్య ఓ టేబుల్‌పై పుస్తకం చదివుతూ ధనుష్ కనిపించారు. ఈ సినిమాలో లెక్చరర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ధనుష్ బర్త్ డే కానుకగా జూలై 28 తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్టు యూనిట్ ప్రకటించారు.

    Happy birthday Dhanush: Sir Vaathi first look poster goes viral

    సర్ సినిమా గురించి దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ధనుష్ ఈ సినిమాలో లెక్చరర్ పాత్రను పోషిస్తున్నారు. జి వి ప్రకాష్ గారి సంగీతం, యువరాజ్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరింత వన్నె తెస్తాయి అని నమ్ముతున్నాను అని తెలిపారు.

    సార్ అక్టోబర్‌లో విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషల్లో తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని, రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు, విశేషాలు వెల్లడి చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు

    నటీనటులు: ధ‌నుష్‌, సంయుక్తా మీన‌న్‌, సాయికుమార్, తనికెళ్ల భ‌ర‌ణి, సముద్ర ఖని,తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సారా, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు.
    రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
    నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌, సాయి సౌజ‌న్య‌
    ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా
    ఎడిట‌ర్: న‌వీన్ నూలి
    సినిమాటోగ్రాఫ‌ర్: జే యువరాజ్
    మ్యూజిక్: జీవీ ప్ర‌కాశ్ కుమార్‌
    యాక్షన్ కొరియోగ్రాఫర్: వెంకట్
    స‌మ‌ర్ప‌ణ: శ్రీకర స్టూడియోస్
    పీఆర్వో: లక్ష్మీవేణుగోపాల్

    English summary
    National award-winning actor Dhanush’s Telugu-bilingual Sir/Vaathi, written and directed by Venky Atluri, is nearing completion. S Naga Vamsi and Sai Soujanya are bankrolling the prestigious project under Sithara Entertainments, Fortune Four Cinemas. Srikara Studios presents the film. Samyuktha Menon plays the female lead.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X