Happy birthday Prashanth neel: కేజీఎఫ్‌తో చరిత్ర.. బాక్సాఫీస్ రికార్డుల మోత
ప్రశాంత్ నీల్.. అంటే తెలియని ఇండియన్ సినీ ఆడియెన్స్ ఉండరేమో.. అంతగా KGF సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నేడు ఈ దర్శకుడు 40వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. దీంతో సౌత్ ఆడియెన్స్ నుంచి భారీ స్థాయిలో బర్త్ డే విషెస్ అందుతున్నాయి.
KGF ఫస్ట్ పార్ట్ చూసిన తరువాత చాలా మంది ఈ దర్శకుడిని రాజమౌళితో పోల్చారు. అతని మేకింగ్ చూస్తే ఎంతో కాలం నుంచి పని చేస్తున్న సీనియర్ డైరెక్టర్ అనుకున్నారు. కానీ KGF అతని రెండవ సినిమానే. మొదటి సినిమా తన సోదరుడైన శ్రీమురళితో చేశాడు. ఉగ్రమ్ అనే ఆ సినిమా 2014లో కన్నడ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. అనంతరం KGF ప్రాజెక్టు కోసం నాలుగేళ్లు కష్టపడిన ప్రశాంత్ మొత్తానికి కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని కూడా పెంచాడు.

బాహుబలి తరువాత అసలైన పాన్ ఇండియా మూవీగా KGF సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కన్నడ సినిమా స్థాయిని పెంచిన ప్రశాంత్ నీల్ కి ప్రస్తుతం అక్కడి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అతనితో వర్క్ చేయడానికి స్టార్ హీరోలు కూడా సిద్ధమవుతున్నారు. ఇక KGF సెకండ్ పార్ట్ అనంతరం తెలుగులోనే మరో పాన్ ఇండియా సినిమాను స్టార్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కి ఒక కథ వినిపించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ కాంబినేషన్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ రానుంది.


Click it and Unblock the Notifications











