HBD Ravi Teja: ఒకే ఒక్క పోస్టర్‌తో స్టోరీ చెప్పేశారు.. అంచనాలు పెంచిన రామారావు

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలో సపోర్టింగ్ రోల్స్ చేసి.. సుదీర్ఘ కాలం పాటు కష్టాలను అనుభవించిన తర్వాత హీరోగా మారాడు రవితేజ. కెరీర్ ఆరంభంలోనే తనదైన సినిమాలతో బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌కు దగ్గరై మాస్ మహారాజా అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కమర్షియల్ హీరోగా మారిపోయి స్టార్ స్టేటస్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి రవితేజ వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఏళ్లుగా యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, కామెడీ టైమింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ హవాను చూపిస్తున్నాడు.

మాస్ మహారాజా రవితేజ చాలా కాలంగా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. అయినప్పటికీ, ఆ మధ్య కొన్నేళ్ల పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది ఆరంభంలో 'క్రాక్' అనే సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇది అతడికి విజయాన్ని అందించడమే కాదు.. కలెక్షన్ల పరంగానూ దుమ్ముదులిపేసింది. కరోనా ప్రభావంతో సీట్ల ఆక్యూపెన్సీని యాభై శాతానికి తగ్గించినా బాక్సాఫీస్‌ను షేక్ చేసే వసూళ్లను రాబట్టింది. దీంతో అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇది సూపర్ హిట్ అవడంతో వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు.

Happy Birthday Ravi Teja: Ramarao On Duty Special Poster Released

'క్రాక్' తర్వాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను మొదలు పెట్టాడు. ఇది చాలా వరకూ షూటింగ్ పూర్తైన తర్వాత కోవిడ్ వల్ల పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాస్ హీరో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను ప్రారంభించాడు. శరత్ మందవ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ కూడా జరిగిపోయింది. సందేశాత్మక కథతో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో దీనిపై అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ నుంచి తాజాగా ఓ అదిరిపోయే పోస్టర్ వచ్చింది. ఈరోజు (జనవరి 26) మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజింగ్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో కొన్ని సన్నివేశాలకు సంబంధించిన క్లిప్స్‌ను కూడా యాడ్ చేశారు. మొత్తంగా ఒకే పోస్టర్‌లో దాదాపుగా సినిమా కథ ఇలా ఉంటుంది అని చెప్పేశారు. దీంతో ఈరోజు వచ్చిన అన్ని పోస్టర్ల కంటే దీనికే ఎక్కువ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా పోస్టర్ భారీ స్థాయిలో వైరల్ అయిపోయింది.

సందేశాత్మక కథతో రూపొందుతోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో మాస్ మహారాజా రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై బజ్‌ను అమాంతం పెంచేశాయి. ఈ చిత్రంలో ఏకంగా ఇద్దరు హీరోయిన్లు దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇది మార్చి 25న విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X