Happy Birthday sai dharam Tej: పడి లేచిన మెగా కెరటం.. అపజయాలు దెబ్బకొట్టినా తగ్గలేదు
సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఎంతో మంది సక్సెస్ కోసం పరుగులు తీసేవారే. అయితే అందరికి అది అంత ఈజీగా దొరకదు. ఎలాంటి సినిమాలు చేసినా కూడా కష్టపడే చేస్తారు.
బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రానా కూడా ప్రతి సినిమా సక్సెస్ అవ్వదు. ఇక టాలీవుడ్ లో వరుస అపజయాలను దాటి పైకొచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. మెగా సపోర్ట్ ఎంతా ఉన్న కూడా సాయి తనకంటూ ఒక మార్కెట్ ని సెట్ చేసుకున్నాడనే చెప్పాలి.

మెగా హీరోకు స్పెషల్ విషెస్
నేడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు. 34ఏళ్ళ వయసులోకి వచ్చిన ఈ మెగా మేనల్లుడికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విషెస్ అందుతున్నాయి. అభిమానులు సెలబ్రెటీలు కూడా సాయికి నిన్న రాత్రి నుంచే స్పెషల్ ఫొటోలతో బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ఈ మెగా హీరో నెక్స్ట్ సోలో బ్రతుకే సో బెటర్ అనే డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఆర్థిక కారణాల వల్ల ఆలస్యం కావడంతో
2014లో రేయ్ సినిమాను కెరీర్ ను మొదలుపెట్టిన సాయి ధరమ్ తేజ్ ఆ సినిమా ఆర్థిక కారణాల వల్ల ఆలస్యం కావడంతో దానికంటే ముందే పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ వంటి సినిమాలతో తనకంటూ ఒక ఒక స్పెషల్ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు. అలాగే తన బాక్సాఫీస్ రేంజ్ కూడా పెరిగింది.

వరుస అపజయాలు దెబ్బకొట్టినా తగ్గలేదు
సినిమా ఇండస్ట్రీలో విజయాలు ఇచ్చే సంతోషం కంటే అపజయాలు మిగిల్చే ఆవేదనే ఎక్కువ. సాయి కూడా వరుసగా 6 సినిమాలతో ఊహించని విదంగా అపజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక 2019ని చిత్రాలహరితో కాస్త డిఫరెంట్ గా ఆలోచించిన సుప్రీమ్ హీరో మొత్తానికి సక్సెస్ ట్రాక్ కొట్టాడు. వరుస అపజయాలు దెబ్బ కొట్టినా కూడా సాయి ధరమ్ తేజ్ తేజ్ మళ్ళీ చాలా స్పీడ్ గా ఫామ్ లోకి వచ్చేశాడు.
Recommended Video

నెక్స్ట్ సోలో బ్రతుకే సో బెటర్
ఇక గత ఏడాది వచ్చిన ప్రతి రోజు పండగే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ సాయి సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాపై కూడా ఆడియెన్స్ లో అంచనాలు భారిగానే ఉన్నాయి. అలాగే దేవకట్టా దర్శకత్వంలో ఒక పొలిటికల్ మూవీ కూడా చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











