Happy Birthday Shivathmika: పంచతంత్రం ఫస్ట్‌లుక్‌లో క్రేజీగా శివాత్మిక రాజశేఖర్
దొరసాని చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రాజశేఖర్ కుమార్తె శివాత్మిక అచితూచి అడుగులేస్తున్నారు. దొరసాని తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్22వ తేదీన తన జన్మదిన్నాన్ని ఆత్మీయులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకొన్నారు. ఈ క్రమంలో తాను నటిస్తున్న పంచతంత్రం చిత్రంలోని లేఖ పాత్రను చిత్ర యూనిట్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో పద్మశ్రీ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, యువ హీరో రాహుల్ విజయ్, 'మత్తు వదలరా' ఫేమ్ నరేష్ అగస్త్య తదితరులు నటిస్తున్నారు.
ఈ పంచతంత్రం చిత్రం టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిసున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. గురువారం శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా యువ హీరో అడివి శేష్ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. గురువారం సాయంత్రం శివాత్మిక ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ పంచతంత్రం చిత్రంలో భాగం కావడం గర్వంగా, ఎంతో సంతోషంగా ఉంది. లేఖ పాత్రలో నటించడం నా అదృష్టం అని అన్నారు.

టైటిల్ పోస్టర్, శివాత్మిక రాజశేఖర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత సృజన్ ఎరబోలు మాట్లాడుతూ పుట్టినరోజు జరుపుకొంటున్న శివాత్మిక రాజశేఖర్‌కు శుభాకాంక్షలు. లేఖ పాత్రలో మరోసారి ప్రేక్షకుల ఆకట్టుకొంటారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు అని అన్నారు. దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ భావోద్వేగాలు మిళితమైన చక్కటి కథ ఇది. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉంటాయి" అని అన్నారు.

నటీనటులు, సాంకేతిక వర్గం
రాహుల్ విజయ్, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, 'పద్మశ్రీ' బ్రహ్మానందం, సముద్రఖని, 'మత్తు వదలరా' ఫేమ్ నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు.
అసోసియేట్ డైరెక్టర్: విక్రమ్
కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియమ్
ఎడిటర్: గ్యారీ బీహెచ్
సినిమాటోగ్రఫీ: రాజ్ కె. నల్లి
ప్రొడక్షన్ కంట్రోలర్: సాయి బాబు వాసిరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భువన్ సాలూరు
క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఉషారెడ్డి వవ్వేటి
మాటలు: హర్ష పులిపాక, కలర్ ఫొటో సందీప్ రాజ్
పాటలు: కిట్టు విస్సాప్రగడ
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి
నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు
రచన, దర్శకత్వం: హర్ష పులిపాక
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి
30 రోజుల్లో ప్రేమించడం ఎలా హీరోయిన్ ఫోటోషూట్ వైరల్.. సరికొత్త అందాలతో


Click it and Unblock the Notifications











