Khushi ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ ఇచ్చే బర్త్ డే గిఫ్ట్ ఏమిటో తెలుసా?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ జన్మదినానికి సంబంధించిన అభిమానుల సంబరాలు సోషల్ మీడియాలో ప్రారంభమయ్యాయి. విజయ్ దేవరకొండ బర్త్ డే కావడంతో సినీ, అభిమాన వర్గాలు ఇప్పటి నుంచే వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఇక ఆయన నటిస్తున్న ఖుషి సినిమాకు సంబంధించిన సాంగ్‌ను మైత్రీ మూవీ మేకర్స్ అందించడానికి రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో Vijaydeverakonda Hash Tag ట్రెండింగ్‌గా నిలిచింది. ఈ పాటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ఖుషీ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ హైలెట్‌గా మారిందనే విషయం సినీ వర్గాల్లో చెప్పుకొంటున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. స్వచ్ఛమైన మనసుల కథ. చుట్టూ తెల్లని మంచు కొండలు, తెల్లని పావురాల మధ్య మనసంతా స్వేచ్ఛా విహంగంలా మారింది అని పేర్కొంటున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ కూడా అందుకు సాక్ష్యంగా నిలిచింది.

ఖుషీ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం నుంచి నా రోజా నువ్వే అనే పాటను ఫస్ట్ లిరికల్ సాంగ్‌గా మే 9వ తేదీన విడుదల చేస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నందున్న ఈ పాటకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఉంటుంది. సంగీత ప్రియులను ఆలరిస్తుంది అని చెప్పారు.
విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషీ చిత్రం ప్యాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అవుతున్నది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.

నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు
నిర్మాతలు : నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
సీఈవో: చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జీ మురళి
ఆర్ట్: ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్: పీటర్ హెయిన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
పీఆర్వో: జీఎస్కే మీడియా


Click it and Unblock the Notifications











