Toxic Glimpse Review: టాక్సిక్ గ్లింప్స్ రివ్యూ.. బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు యష్ క్రేజీ గిఫ్ట్
కేజీఎఫ్ సిరీస్ సక్సెస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటించిన చిత్రం టాక్సిక్. మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్, మానస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హీరో యష్, గీతూ మోహన్ దాస్ కథను అందించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు రాజీవ్ రవి సినిమాటోగ్రఫి, రవి బస్రూర్ మ్యూజిక్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, కునాల్ శర్మ సౌండ్ ఇంజినీర్‌గా, గణేష్ ఆచార్య, ఇమ్రాన్ సర్దారియా, ఏ హర్ష కొరియోగ్రాఫర్లుగా, జేజే పెర్రీ, అంబరివ్, కెచా కంపాక్‌డీ, అమృత్ సింగ్ యాక్షన్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను 2026, మార్చి 19వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే హీరో యష్ బర్త్ డేను పురస్కరించుకొని ఈ సినిమాలో ఆయన నటిస్తున్న రాయా క్యారెక్టర్‌ను అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టాక్సిక్ గ్లింప్స్ వివరాల్లోకి వెళితే..

గ్లింప్స్ వివరాల్లోకి వెళితే.. ఓ తండ్రి తన కుమారుడి అంత్యక్రియలను క్రిస్టియన్ శ్మశాన వాటికలో నిర్వహిస్తుంటాడు. అతడి చుట్టూ భారీగా సైన్యం మోహరించి ఉంటుంది. ఇలాంటి ప్రదేశానికి అతడు వస్తాడా? అంటూ ఆ వ్యక్తి అనుమానం వ్యక్తం చేస్తాడు. నా కొడుకు ఆత్మ శాంతించేలా అంత్యక్రియలు జరుగాలని ఆయన కోరుకొంటాడు. అంతలోనే శ్మశాన వాటిక గేట్లు బలవంతంగా మూసేస్తారు. ఆ తర్వాత ప్రాంతానికి రివ్వున వేగంగా విలాసవంతమైన కారు దూసుకొస్తుంది.
అలా దూసుకొచ్చిన కారులో నుంచి ఓ తాగుబోతు బయటకు వచ్చి ఆ కారు బ్యాటరీకి కొన్ని వైర్లు కనెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత కారులో ఓ వ్యక్తి ఓ మహిళను శారీరీకంగా అనుభవిస్తుంటాడు. కారు ఊగడం చూసి శ్మశాన వాటికలో ఆర్మీ ఫైరింగ్‌కు సిద్దమవుతారు. కానీ అప్పటికే శ్మశానంలో వరుస పేలుళ్లు సంభవిస్తుంటాయి. ఆ క్రమంలో మహిళను అనుభవించిన ఆ వ్యక్తి (యష్) అత్యాధునిక ఆయుధాన్ని ధరించి కాల్పులు జరుపుతాడు. అనంతరం స్లైలిష్‌గా సిగరెట్ తాగుతూ డాడీస్ హోమ్.. పొగల మధ్య నుంచి యష్ కనిపిస్తాడు. అలా ఆయన క్యారెక్టర్‌ను ఇంట్రడూస్ చేసి అంచనాలు పెంచారు.
టాక్సిక్ గ్లింప్స్ చూస్తే.. హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా సాంకేతిక అంశాలు చాలా రిచ్‌గా కనిపించాయి. కెమెరా వర్క్, ఆర్ట్ విభాగం పనితీరు, యాక్షన్ సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయి. గ్లింప్స్ కనురెప్ప కొట్టకుండా చూసేలా చాలా టైట్‌గా కట్ చేశారు. యష్ క్యారెక్టర్‌ను పరిచయం చేసిన విధానం ఈ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. కేజీఎఫ్ తర్వాత ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యష్ అభిమానులకు ఈ సినిమా ఆకలిని తీర్చే విధంగా ఉండటమే కాకుండా విందు భోజనాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











