ఫ్రెండ్ షిప్: హీరో అవతారమెత్తిన ఇండియన్ క్రికెటర్..
ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన స్పిన్ బౌలింగ్‌తో టీమిండియా అద్బుతమైన విజయాల్లో భాగమయ్యాడు హర్భజన్. తన సుదీర్ఘ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పిన బజ్జీ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్దమయ్యాడు.
ఇప్పటికే పలు కంపెనీలను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న ఆయన.. ఇక ఓ సినిమాలో హీరోగా నటించేందుకు మొదటిసారి కెమెరా ముందుకు రాబోతున్నారు. తమిళంలో 'ఫ్రెండ్ షిప్' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. బిగ్‌బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా నటిస్తోన్నఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జెపిఆర్&స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇద్దరు వేరువేరు వ్యక్తుల చేతులకి ఒకే సంకెళ్లు వేసి ఉన్న ఈ లుక్ టైటిల్‌కి తగ్గట్టుగా 'ఫ్రెండ్ షిప్' విలువ తెలిపేలా ఉంది. ఈ చిత్రాన్ని పలు ఇండియన్ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా 'ఫ్రెండ్ షిప్' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











