హోటల్‌లో ఆ నటితో దొరికిన హార్డిక్ పాండ్యా.. వాలెంటైన్స్ డేకి ఊహించని సర్‌ప్రైజ్
ఇండియన్ క్రికెటర్లలో చాలామంది ఎంతోమంది ముద్దుగుమ్మలతో ప్రేమాయణాలు సాగించారు. వీరిలో చాలావరకు బ్రేకప్స్ జరగ్గా.. ఒకటి రెండు మాత్రమే పీటల వరకు వెళ్లాయి. కొందరు క్రికెటర్ల అయితే ఎంతోమంది ముద్దుగుమ్మలతో డేటింగ్ చేశారు. వీరిలో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా రూటే సెపరేట్. ఈ మధ్యకాలంలో ప్రేమాయణాలు, బ్రేకప్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు పాండ్యా. తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్న పాండ్యా.. తాజాగా ఓ టాప్ మోడల్ కమ్ హీరోయిన్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వాలెంటైన్ డేను పురస్కరించుకుని తన ప్రియురాలికి పాండ్యా సర్‌ప్రైజ్ ఇచ్చాడట. ఈ వివరాల్లోకి వెళితే..
హార్డిక్ పాండ్యా గతంలో లిషా శర్మ, ఇల్లి అవ్వరం, పరిణితి చోప్రా, ఊర్వశి రౌటేలా, ఈషా గుప్తా, నటాషా స్టాంకోవిక్‌లతో డేటింగ్ చేశాడు. వీరిలో నటాషాతో 2020లో వివాహం కాగా.. ఈ దంపతులకు అగస్త్య అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్లు వీరిద్దరి మధ్య బంధం సజావుగానే సాగగా... తర్వాత ఇద్దరు మధ్య మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోయారు. నాటి నుంచి పాండ్యా పలువురు ముద్దుగుమ్మలతో తిరుగుతున్నట్లుగా క్రికెట్ వర్గాల్లో పుకారు చక్కర్లు కొడుతోంది.

కొద్దిరోజుల క్రితం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో హార్డిక్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ సందడి చేసినట్లు ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమె పేరు జాస్మిన్ వాలియా. భారత సంతతికి చెందిన బ్రిటీష్ సింగర్, టెలివిజన్ నటి. అయితే ఈ బంధం కూడా ఎక్కువ రోజులు సాగలేదు. జాస్మిన్ - పాండ్యాలు విడిపోయారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం ద్వారా బ్రేకప్‌పై హింట్ ఇచ్చేశారు. ఆ తర్వాత కూడా పాండ్యా కొత్త గర్ల్‌ఫ్రెండ్స్ వేటలో ఉన్నట్లు కథనాలు వచ్చాయి.
ఇకపోతే.. గత కొన్నాళ్లుగా ప్రముఖ మోడల్, నటి మహికా శర్మతో హార్దిక్ పాండ్యా ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం మహికా శర్మ పోస్ట్ చేసిన ఓ సెల్ఫీ వీడియోలో హార్డిక్ పాండ్యా ఉండటంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. మహికా శర్మ విషయానికి వస్తే చదువు తర్వాత మోడలింగ్, నటనలోకి దిగారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన వాణిజ్య ప్రకటనల్లో కనిపించారు. 2024లో జరిగిన ఇండియన్ ఫ్యాషన్ అవార్డుల్లో మోడల్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని మహికా అందుకున్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం శ్రీలంకలోని కొలంబోలో జరగనున్న మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. దాంతో ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. అయితే కొలంబో హోటల్ లాబీలో హార్దిక్ పాండ్యా.. తన గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రచారం జరుగుతోన్న మహికా శర్మతో కనిపించాడు. నిబంధనల ప్రకారం భారత జట్టు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులను, సన్నిహితులను కలవడానికి వీల్లేదు. అలాంటిది మహికతో పాండ్యా కనిపించడం వివాదాస్పదమైంది. అయితే ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాండ్యా తన ప్రియురాలిని ప్రత్యేకంగా కొలంబో పిలిపించుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. తన మెడపై ఎమ్ అనే ఇంగ్లీష్ లెటర్, దాని కింద పరిగెడుతున్న చిరుత పులి బొమ్మను టాటూగా వేయించుకున్నాడు. ఎం అంటే తన ప్రియురాలు మహికా శర్మ అని వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమెతో తాను ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా హింట్ ఇచ్చాడు హార్దిక్. ప్రస్తుతం మహికా శర్మ - హార్డిక్ పాండ్యా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











