హరిహర వీరమల్లు విడుదల వాయిదా! కారణం ఏమిటంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ వాయిదా పడినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితోపాటు జ్యోతికృష్ణ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా వాస్తవంగా జూన్ 12వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని వీఎఫ్ఎక్స్ వర్కులు పూర్తి కానందు వలన ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్మాత నిర్ణయించుకొన్నట్టు సమాచారం. ఈ సినిమా వార్తకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ వాయిదా పడినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితోపాటు జ్యోతికృష్ణ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా వాస్తవంగా జూన్ 12వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని వీఎఫ్ఎక్స్ వర్కులు పూర్తి కానందు వలన ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్మాత నిర్ణయించుకొన్నట్టు సమాచారం. ఈ సినిమా వార్తకు సంబంధించి వివరాల్లోకి
వాస్తవ కథతో హరి హర వీరమల్లు సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. స్టోరీ డిమాండ్ చేయడం వల్ల ఎక్కువగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ అవసరం ఏర్పడింది. ఈ సినిమాను ఇరాన్, పలు ఇతర దేశాల్లో టెక్నికల్ వర్క్ జరుగుతున్నది. ఈ సినిమా రిలీజ్ డేట్ సమీపిస్తుండటం, అలాగే ఇంకా పోస్ట్ ఫ్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం, హడావిడిగా చివరి నిమిషంలో విడుదల చేయడం ఎందుకనే ఉద్దేశంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్టు సమాచారం.
తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలంగా షూటింగ్, ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సినిమాగా ఈ సినిమా చేరిపోయింది. సుమారుగా నాలుగు సార్లు ఈ సినిమా విడుదలను వాయిదా వేయడం జరిగింది. దాంతో అభిమానులు ఆశలు, ఉత్సాహంపై నీళ్లు జల్లినట్టు అయింది అని పవర్ స్టార్ అభిమానులు నిరాశతో వెల్లడించారు. ఇంకా ఈ సినిమా రిలీజ్ వాయిదాపై నిర్మాత, చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయనున్నది.
హరి హర వీరమల్లు సినిమా వాయిదా నేపథ్యంలో మరో డేట్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 5 తేదీన గానీ, జూలై 12వ తేదీన గానీ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. అన్ని విషయాలపై కూలకుషంగా చర్చించుకొన్న తర్వాత ఈ సినిమా డేట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సినిమా వాయిదా, తదుపరి రిలీజ్ డేట్‌కు సంబంధించిన వార్తకు సంబంధించిన కీలక సమాచారం కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











