Krish Review on Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లుపై డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రివ్యూ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమాను పాపులర్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్‌కు కోవిడ్ లాక్‌డౌన్స్, ఆయన వ్యక్తిగత, ప్రొఫెషనల్ కారణాలు వల్ల ఈ ప్రాజెక్టుకు దూరమయ్యారు. ఆ తర్వాత నిర్మాత ఏఏం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ సినిమాను పకడ్బందీగా ప్లాన్ చేసి పూర్తి చేశారు. అనేక వాయిదాల తర్వాత ఈ మూవీ జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించి తాజాగా క్రిష్ చేసిన ట్వీట్ ట్రెండింగ్ అవుతున్నది. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే..
చరిత్ర ఆనవాళ్లను, బయటి ప్రపంచానికి తెలియని కథతో ప్రతీ ఫ్రేమ్‌లో గొప్పగా రూపొందించి బ్యాంగ్‌తో సినిమా ప్రపంచంలోకి హరిహర వీరమల్లు అడుగుపెట్టడానికి సిద్దమయ్యాడు. ఈ ప్రయాణం ఇద్దరు లెజెండ్స్ పవన్ కల్యాణ్, ఏఎం రత్నం కృషి వల్లే సాధ్యమైంది. ఇది కేవలం ఓ సినిమా కథ. గొప్ప స్పిరిట్‌తో రూపొందిన కథా చిత్రం అని క్రిష్ జాగర్లమూడి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

గ్రేటర్ అనే పదం కంటే ఎక్కువగా ఎక్స్ట్రార్డినరీ ఫోర్స్ ఉన్న అరుదైన వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయనలోని తపన, ఫైర్‌ను ఏ కెమెరా కూడా బంధించలేదు. అవసరాన్ని బట్టి ఆ శక్తి ఆయన నుంచి వస్తుంది. ఆయన రగిలించే స్పూర్తినే హరిహర వీరమల్లుగా తెరపైన ఆవిష్కరించారు. ఈ సినిమాకు ఆయన ఆత్మ, వెన్నుమక. ఓ తుఫాన్ అని ఎన్ని చెప్పినా తక్కువే అని క్రిష్ ప్రశంసలు గుప్పించారు.
ఇండియన్ సినిమాకు గొప్ప అనుభూతిని పంచిన సినిమాలను అందించిన గొప్ప నిర్మాత ఏఎం రత్నం. భారీ నమ్మకంతో ప్రతీ సినిమాను గొప్పగా ఆవిష్కరించాలనే ఒక విజన్ ఉన్న వ్యక్తి. అలాంటి అరుదైన నిర్మాతకు హరిహర వీరమల్లు సినిమా ఎనలేని శక్తిని ఇవ్వాలని కోరుకొంటున్నాను అని క్రిష్ తన ట్వీట్‌లో గొప్పగా కీర్తించారు.
ఈ సినిమా కథ అత్యంత ఆసక్తిని, ఉత్తేజాన్ని కలిగించిన యుద్ధ కథ. ఒక దర్శకుడిగానే కాకుండా చరిత్రలో మరుగున పడి వాస్తవాలను అన్వేషించే ఔత్సాహికుడిగా నన్ను ఆకట్టుకొన్నది. దేశ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా కొన్ని జీర్ణించుకోలేని కొన్ని నిజాలను సినిమాగా చెప్పాలనుకొన్నాం. ఈ సినిమా ద్వారా ఏకకాలంలో వినోదం, చైతన్యం కలుగాలన్నదే మా ఉద్దేశం. ఇలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన లెజెండ్స్ పవన్ కల్యాణ్, ఏఎం రత్నం గారికి వినమ్రపూర్వకంగా ధన్యవాదాలు అని క్రిష్ తెలిపారు. కొన్ని సంవత్సరాల కష్టం వెనుక దాగిన ఫైర్, నమ్మకం చివరకు తెర మీద ఆవిష్కరించే సమయం ఆసన్నమైనందుకు ఆనంగా ఉంది అని క్రిష్ చెప్పారు.


Click it and Unblock the Notifications











