హరి హర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్.. ఈసారి పక్కా విడుదలే! కానీ అది సస్పెన్స్ గానే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పిరియాడికల్ అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు'. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అయితే ముందుగా పార్ట్ 1 ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పటికే పది సార్లు వాయిదా పడింది. మళ్లీ ఎప్పటికప్పుడు కొత్త రిలీజ్ డేట్ లను ప్రకటిస్తూనే వస్తోంది. గతంలో జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నామని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్ తో హరి హర వీరమల్లు..
హరి హర వీరమల్లు చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించిన సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూ.250 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో భారీ తారాగణం నిధి అగర్వాల్, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, పూజితా పొన్నాడ, అనసూయ భరద్వాజ్, అనుపమ్ ఖేర్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాష్లలోనూ విడుదల చేయబోతున్నారు.

Hari Hara Veeramallu New Release Date

5 ఏళ్లుగా ఎదురుచూపులు..
హరి హర వీరమల్లు చిత్రం 2020 జనవరిలో ప్రారంభమైంది. సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరిపారు. మొదట ఈ చిత్రానికి క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించారు. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రొగ్రామ్స్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిందీ ప్రాజెక్ట్. దాంతో క్రిష్ జాగర్లముడి తనకున్న కమిట్ మెంట్స్ కారణంగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు నుంచి తప్పుకున్నాడు. దాంతో ఏఎం రత్నం కొడుకు ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను స్వీకరించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలు, దర్శకుల మార్పు కారణంతో ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

10 సార్లు వాయిదా పడ్డ ఏకైక చిత్రం..
హరి హర వీరమల్లు చిత్రం రిలీజ్ కు ముందే వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీని 10 సార్లు వాయిదా వేసినా.. అదే హైప్ మెయింటేయిన్ చేస్తున్న ఏకైక చిత్రంగా హరి హర వీరమల్లు రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రాన్ని మొదటగా 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ అది కాస్తా 3 ఏళ్లకు పైగా ఆలస్యమైంది. 10 సార్లు వాయిదా పడి తాజాగా మరోసారి కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది.

తాజాగా కొత్త రిలీజ్ డేట్..
ఎట్టకేళలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త అందింది. హరి హర వీరమల్లు చిత్రానికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. జూన్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్ట తెలపగా.. తాజాగా జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. అయితే ట్రైలర్ రిలీజ్ చేస్తూ విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పిన మేకర్స్ ప్రస్తుతం మాత్రం కేవలం రిలీజ్ డేట్ ను మాత్రమే అనౌన్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X