పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన తెలంగాణ పోలీసులు.. ‘హరిహర’కు సంధ్య థియేటర్‌లో అనుమతులు రద్దు

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం మెగా అభిమానులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి నిరీక్షణకు ఎట్టకేలకూ ఓ మోక్షం లభించింది. ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అన్ని సినిమా హాల్స్‌లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకొన్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శనకు తెలంగాణ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో పవర్ స్టార్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

గత కొన్ని నెలలుగా విడుదల వాయిదా పడుతున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్దమైంది. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా పూర్తి చేసుకొన్నాయి. ఈ క్రమంలో వేగవంతంగా, క్రేజీగా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టేందుకు చిత్ర యూనిట్ ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే ట్రైలర్ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు.

Hari Hara Veeramallu Trailer unveil

హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కోసం తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 50కి పైగా థియేటర్లను రెడీ చేశారు. హైదరాబాద్‌లోనే డజన్‌కు పైగా థియేటర్లలో ఈ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. జూలై 3వ తేదీ 11 గంటల సమయంలో ఏకకాలంలో థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని ముహుర్తం నిర్ణయించారు. ఈ క్రమంలో బాలానగర్‌లోని విమల్ థియేటర్, అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంథ్య థియేటర్లను ముస్తాబు చేశారు.

అయితే గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పోలీసులు విభాగం, ముఖ్యంగా చిక్కడపల్లి పోలీసులు ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అనుమతులను నిరాకరించారు. దాంతో థియేటర్ యాజమాన్యం తమ సినిమా హాల్ గేట్ ముందర హరిహర వీరమల్లు ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం రద్దు అయింది అనే బోర్డును ప్రదర్శించారు. దాంతో ఈ థియేటర్‌ను అలంకరించి పండుగ వాతావరణం సృష్టించాలని భావించిన పవన్ ఫ్యాన్స్ ఆశలపై పోలీసులు నీళ్లు చల్లారు.

Hari Hara Veeramallu Trailer unveil

పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన లాఠీఛార్జి, తొక్కిసలాట కారణంగా ఓ మహిళ మృతి చెందడం, అలాగే ఓ చిన్నారి బాలుడు కోమాలోకి వెళ్లి ఇప్పటికే అనారోగ్యంత బాధపడటం అందర్నీ విషాదానికి గురి చేసింది. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఈ థియేటర్ యాజమాన్యం, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలాంటి దుర్ఘటనలు, సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ముందుస్తుగానే తగిన చర్యలు పోలీసులు తీసుకొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తీసుకొన్న ఈ నిర్ణయంపై సాధారణ పౌరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, క్రిష్ జాగర్లమూడి నుంచి 'హరి హర వీరమల్లు' చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ.. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు 'హరి హర వీరమల్లు'లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X