twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్ని భాషల్లోకి వెళ్లనున్న ప్లే బ్యాక్.. రియల్ సక్సెస్ అంటే ఇదే!

    |

    ఓ చిన్న సినిమాకు సరైన గుర్తింపు రావడం మామూలు విషయం కాదు. కొత్త ప్రయత్నాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న ఈ తరుణంలో మరో ప్రయోగాన్ని నెత్తిన పెట్టేసుకున్నారు. నిన్న విడుదలైన ప్లే బ్యాక్ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకులు కూడా మంచి రివ్యూలను ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్యాన్ ఇండియా లెవెల్‌కు వెళ్తోంది.

    క్రాస్ టైమ్ కనెక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ప్లే బ్యాక్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ వచ్చింది. డైరెక్టర్ హరి ప్రసాద్ కథ, కథనం తెరకెక్కించిన విధానాని అందరూ ఫిదా అయ్యారు. ఇక సినిమా విడుదలైన మొదటి రోజే సాటిలైట్ రైట్స్ భారీ రేట్ కు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. మరోవైపు సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేశారు.

     Hari prasad jakka Playback Going to Remake In All Languages

    ఇతర దక్షిణాది భాషలతో పాటూ, హిందీలోనూ సినిమాను పునర్నిర్మించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అన్ని భాషల్లోనూ హరిప్రసాద్ జక్కానే దర్శకత్వం వహించబోతున్నారని ప్లే బ్యాక్ హక్కులు కొన్న జెమినీ యాజమాన్య ప్రకటించింది. మొత్తానికి ఇలా మొదటి సినిమాతోనే ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో హరి ప్రసాద్ జక్కా తన సత్తా చాటాడు. అయితే వీటికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

    English summary
    Playback Going to Remake In All Languages,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X