For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్: బర్త్‌డేకు మర్చిపోలేని ట్రీట్ రెడీ

  |

  మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. కెరీర్ ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుని బడా హీరోగా ఎదిగిపోయాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్‌తో అలరించిన అతడు.. అదిరిపోయే హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో స్టార్‌డమ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పాలిటిక్స్ కోసం పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇది అనుకున్న రీతిలో స్పందనను అందుకుని భారీ వసూళ్లను రాబట్టడంతో పవన్ ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా లైన్‌లో పెట్టాడు.

  బెడ్ మీద అమలా పాల్ అరాచకం: బాబోయ్ ఇదే దారుణం సామీ!

  టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితమే 'భీమ్లా నాయక్' అనే సినిమాను అందించాడు. ఇందులో దగ్గుబాటి రాణా కీలక పాత్రలో నటించాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ, రెండో వారం నుంచి వసూళ్లు భారీగా డౌన్ అయ్యాయి. ఫలితంగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోలేదు. కానీ, మొత్తంగా ఈ చిత్రం 97 కోట్ల రూపాయలకు పైగా షేర్‌ను రాబట్టి పవన్ కెరీర్‌లోనే బెస్ట్ ఫిగర్స్‌ను సాధించింది. ఈ సినిమా ఫలితంపై సంతృప్తిగానే ఉన్న పవన్ మిగతా సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు.

  Harihara Veeramallu Action Teaser on September 2nd

  పవన్ కల్యాణ్ రెండేళ్ల క్రితమే 'హరిహర వీరమల్లు' అనే సినిమాను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న ఈ మూవీని ఏఎమ్ రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ చిత్రంలో ఈ స్టార్ హీరో వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, దీన్ని మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురు కావడంతో పాటు పవన్ కల్యాణ్ బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం రాజకీయాలపై ఫోకస్ చేస్తోన్న ఈ స్టార్ హీరో.. త్వరలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకుంటోన్నాడు.

  బట్టలు లేకుండా స్టార్ హీరోయిన్: డెలివరీ అయిన వెంటనే ఘోరంగా!

  భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి గతంలో పలు ప్రచార చిత్రాలు వచ్చాయి. అయితే, సినిమా అనుకున్న సమయానికి రాకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. వాళ్లను ఖుషీ చేయడానికి ఇప్పుడు దర్శకుడు క్రిష్ అదిరిపోయే ప్లాన్ వేసినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీని 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి ఓ యాక్షన్ టీజర్‌ను విడుదల చేయబోతున్నారట. ఇందులో పవర్ స్టార్ యుద్ధ విన్యాసాలను చూపించబోతున్నారని తెలిసింది. ఇది ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉండబోతుందని సమాచారం.

  'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తైంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది.

  English summary
  Power Star Pawan Kalyan Now Doing Harihara Veeramallu under Krish direction. This Movie Action Teaser Will Release on September 2nd.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X